Home » అల్లు అర్జున్ పుష్ప సినిమాలో ‘తగ్గేదెలే’ డైలాగ్ వెనుక దాగి ఉన్న కథ ఇదే..!

అల్లు అర్జున్ పుష్ప సినిమాలో ‘తగ్గేదెలే’ డైలాగ్ వెనుక దాగి ఉన్న కథ ఇదే..!

by Anji
Ad

టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. సుకుమార్ తెలుగు చలన చిత్ర దర్శకుడు,  రచయిత కాకముందు గణితం అధ్యపకుడు. 2004లో మొదటి చిత్రం అల్లు అర్జున్ తో ఆర్య చిత్రాన్ని తెరకెక్కంచి సంచలన విజయం సాధించాడు. దీంతో ఈ చిత్రం అల్లు అర్జున్ ని స్టార్ గా నిలబెట్టింది. 

Also Read :  తెలుగు సినిమా కాన్సెప్ట్ ని హాలీవుడ్ వాళ్లు కాపీ కొట్టారంటే నమ్ముతారా ?

Advertisement

ఆ తరువాత రామ్ పోతినేని తో జగడం చిత్రం తీశాడు. ఈ సినిమా ప్లాప్ గా నిలిచింది. ఆర్య 2, 100 %లవ్ వంటి చిత్రాలతో మంచి హిట్ అందుకున్నారు. ఆ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో మంచి కాన్సెప్ట్ మూవీ 1 నేనొక్కడినే తీసినప్పటికీ ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక ఆ తరవాత జూనియర్ ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో.. , రాంచరణ్ తో రంగస్థలం వంటి సూపర్ హిట్ సినిమాలు తీసి అగ్రదర్శకుడిగా కొనసాగుతున్నారు. రంగ స్థలం సినిమాతో తన కెరీర్ లోనే ఉత్తమ విజయాన్ని అందుకున్నాడు సుకుమార్. 2021లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ పుష్ప చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.  

Advertisement

Also Read :  శ్రియ శరన్ మళ్లీ ప్రెగ్నెంట్… ఆ ఫోటోలు వైరల్

ప్రస్తుతం పుష్ప2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు సుకుమార్. పుష్ప సినిమాలో ఉన్నటువంటి తగ్గెదేలే అనే డైలాగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అసలు ఈ తగ్గెదెలే అనే డైలాగ్  ఇందులో పెట్టడానికి కారణం ఏంటంటే..  మంచి డైలాగ్  కోసం టీమ్ అంతా కూర్చొని ఒక ప్లాన్ చేసుకున్నారు. తగ్గె ప్రసక్తే లేదు. నువ్వు వెనుకడుగు వేయకూడదు. తలదించకూడదు. ఇలా డైలాగ్ లను అనుకున్నారు. ఫైనల్ గా డైలాగ్ ని క్రాక్ చేసింది మాత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అని చెప్పాలి. మ్యానరింగ్ కోసం ఏదేదో అనుకుంటాం ఇంతకు ముందు నువ్వు చేసింది చేసేద్దామని చెప్పారట సుకుమార్. అలా తగ్గేదేలే డైలాగ్ పుష్ప సినిమాలో పెట్టారు. ఆ డైలాగ్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. 

Also Read :  1 కాదు… 2… కాదు మహేష్ తో ఏకంగా మూడు సినిమాలు ప్లాన్ చేసిన రాజమౌళి

Visitors Are Also Reading