Home » 1 కాదు… 2… కాదు మహేష్ తో ఏకంగా మూడు సినిమాలు ప్లాన్ చేసిన రాజమౌళి

1 కాదు… 2… కాదు మహేష్ తో ఏకంగా మూడు సినిమాలు ప్లాన్ చేసిన రాజమౌళి

by Bunty
Ad

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. మహేష్, త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. అలాగే యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ కూడా నటిస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు, రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసింది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

READ ALSO : Twitter Logo : ట్విట్టర్ లోగో మారింది.. పిట్ట స్థానంలో కుక్క వచ్చిందోచ్

Advertisement

మహేష్ తో జక్కన్న ఎలాంటి సినిమా చేస్తారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఇప్పటికే ఈ సినిమా కథను రాజమౌళి తండ్రి ప్రముఖ రైటర్ అయిన విజయేంద్రప్రసాద్ సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. విజయేంద్ర ప్రసాద్ అద్భుతమైన కథను సిద్ధం చేశారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా వర్క్ షాప్ కూడా మొదలైందట.

Advertisement

READ ALSO : Virupaksha Trailer : “విరూపాక్ష” ట్రైలర్‌ వచ్చేసింది…ఇక్కడ ఎవరికైనా చావుకి ఎదురెళ్లే దమ్ముందా?

After RRR, SS Rajamouli To Collaborate With Mahesh Babu For A Jungle-Based Adventure - Confirmed!

త్వరలోనే మహేష్ బాబు కూడా ఈ వర్క్ షాప్ లో పాల్గొంటారని తెలుస్తోంది. త్రివిక్రమ్ తో మహేష్ బాబు చేస్తున్న సినిమా వచ్చే జనవరి 13న విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మహేష్, రాజమౌళి మూవీ షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నారు. మహేష్ ప్రాజెక్టును మాత్రం ఇంటర్నేషనల్ లెవెల్ మార్కెట్ కు తగ్గట్టుగా మూడు భాగాల్లో తీసుకురావాలి అని ఆలోచనతో ఉన్నారట రాజమౌళి. హాలీవుడ్ స్టార్స్ కూడా ఉంటారని టాక్ వినిపిస్తోంది.

READ ALSO : సీఎం కేసీఆర్‌ ఆశలు గల్లంతు.. BRS పార్టీ గుర్తింపు రద్దు ?

Visitors Are Also Reading