Home » సుమన్ జైలుకు వెళ్లడం విషయంలో దాగి ఉన్న సీక్రెట్ ఇదే..!

సుమన్ జైలుకు వెళ్లడం విషయంలో దాగి ఉన్న సీక్రెట్ ఇదే..!

by Anji
Ad

టాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటులలో సుమన్ ఒకరు. ప్రస్తుతం సుమన్ వయస్సు 64 సంవత్సరాలు. తెలుగులో ఇప్పటికీ ఆయనకు వరుసగా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి కంటే ఎక్కువగా సుమన్ ని అభిమానించే వారు. ప్రస్తుతం నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో పాటు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ని కొనసాగిస్తున్నారు సుమన్. రెమ్యూనరేషన్ కూడా భారాగానే ఉందని తెలుస్తోంది. సుమన్ కి హీరోగా మంచి గుర్తింపు లభించిన సమయంలోనే ఆయన ఓ వివాదంలో చిక్కుకోవడంతో దాదాపు 6 నెలల పాటు జైలు శిక్షణను అనుభవించారు. 

Advertisement

ఈ కేసులో సుమన్ చిక్కుకోవడం విషయంలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి వల్లనే సుమన్ జైలుకి వెళ్లాడని కామెంట్స్ వినిపించాయి. అయితే హీరో సుమన్ జైలుకు వెళ్లడం వెనుక సీఎం ఎంజీఆర్ ఉన్నారని తెలుస్తోంది.  అప్పటి డీజీపీ కూతురు సుమన్ ని ఇష్టపడటం డీజీపీకి నచ్చలేదని.. దీంతో సీఎం ద్వారా సుమన్ కి చెప్పించాలని డీజీపీ ప్రయత్నించగా.. సీఎం మాటను సైతం సుమన్ లెక్క చేయలేదని సమాచారం తెలుస్తోంది.మరోవైపు సుమన్ స్నేహితుల్లో ఒకరు ప్రముఖ లిక్కర్ కాంట్రాక్టర్ కూతురితో ప్రేమలో ఉండటం కూడా సీఎం, డీజీపీని బాధ పెట్టినట్టు తెలుస్తోంది.

Advertisement

అందుకే సుమన్ ఏ తప్పు చేయకపోయనా తెలివిగా ఆయనను ఈ కేసులో ఇరింకించినట్టు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు సాగర్ ఓ సందర్భంలో ఈ విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సుమన్  కేసులో ఇరుక్కున్న తరువాత ఆస్తులకు సంబంధించి స్నేహితులు మోసం చేసారని సమాచారం. సుమన్ జైలు నుంచి బయటికీ వచ్చే సమయానికి కూడా ఆయన పేరు మీద ఆస్తులు లేకుండా చేసారట. సుమన్ తరువాత కొద్ది మంది చేసిన సాయం వల్ల కెరీర్ పరంగా ఎదుగుతున్నారు. సోషల్ మీడియాలో సైతం సుమన్ మంచి పాపులారీటీ పెరుగుతోంది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

జీవితంలో అలా జరగాలని కోరుకుంటే ఒత్తిడి తప్పదు.. నిహారిక పోస్ట్ వైరల్..!

ప్రభాస్-అనుష్క పెళ్లి గురించి కృష్ణంరాజు తన డైరీలో ఏం రాసుకున్నారో తెలుసా ?

Visitors Are Also Reading