Home » ఈ అబ్బాయికి శరీరం మొత్తం వెంట్రుకలే.. వైద్యులు ఏమంటున్నారంటే ?

ఈ అబ్బాయికి శరీరం మొత్తం వెంట్రుకలే.. వైద్యులు ఏమంటున్నారంటే ?

by Anji
Ad

సాధారణంగా ప్రపంచ వ్యాప్తంగా రకరకాల వ్యాధులు వస్తున్నాయి. ఒక్కొక్కరికీ ఒక రకమైన జబ్బు వస్తుంటుంది. కొన్ని రోగాలు కోట్లలో ఉండే కొద్ది మందికే సంభవిస్తుంటాయి. అలాంటి రోగాల బారిన పడిన వారు బయటికి వెళ్లాలంటే భయానికి గురవుతుంటారు. అసలు వారికి ఇలాంటి లక్షణాలు ఎందుకు వచ్చాయో కూడా తెలియదు. పూర్వం మనుషులు కోతి నుంచి ఆవిర్భవించారని  చెబుతుంటారు. మన పూర్వీకులు ఎక్కువగా వెంట్రుకలతో ఉండేవారని చరిత్ర పేర్కొంటుంది. అందుకే మన శరీరం మీద రోమాలు రావడం సహజమే. 

Advertisement

మధ్యప్రదేశ్ కి చెందిన లలిత్ పాటిదార్ (17)కి అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా శరీరం మొత్తం వెంట్రుకలే వచ్చాయి. అతని శరీరం మొత్తం వెంట్రుకలమయంగా మారిపోయింది. దీంతో అందరూ అతడినీ చూసి భయపడుతున్నారు. అసలు ఒళ్లంతా వెంట్రుకలు రావడం ఏంటనే అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. అతనికి ఆరేళ్ల నుంచే వెంట్రుకలు రావడం ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం అతని ఒళ్లు మొత్తం వెంట్రుకలతో నిండిపోయింది. చాలా మంది అతడిని చూడడానికి జంకుతున్నారు. అతను చదువుకునే పాఠశాలలో తోటి విద్యార్థులు అతడినీ ఆటపట్టిస్తున్నారు. జంతువు మాదిరిగా ఉన్నావని ద్వేషిస్తున్నారు. వెంట్రుకలు ఎక్కువగా పెరిగినప్పుడు ట్రిమ్ చేసుకుంటున్నప్పటికీ.. కొద్ది రోజుల తరువాత యదావిధిగా పెరుగుతున్నాయని లలిత్ పాాటిదార్ పేర్కొంటున్నాడు. అతని శరీరం మొత్తం వెంట్రుకలతో నిండిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 

Advertisement

Also Read :  ఎన్టీఆర్ కోసం కృష్ణ పేపర్ ప్రకటించారు.. ఎందుకో తెలిస్తే..!!

మధ్యయుగం నాటి పురుషుల్లో మాత్రమే ఇలా వెంట్రుకలు ఉండేవి. కానీ ప్రస్తుతం ఈ మధ్య ప్రదేశ్ యువకుడికి వెంట్రుకలు రావడం ఏంటని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతనిలో పూర్వికుల డీఎన్ఏ ఉందేమోనని సందేహపడుతున్నారు.మధ్యయుగం నాటి నుంచి ఇప్పటివరకు దాదాపు 50 మంది వరకు ఈ వ్యాధితో బాధపడినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అతడు జీవితకాలం వెంట్రుకలతో సహజీవనం చేయాల్సిందే. వెంట్రుకలతో కనిపించడంతో వింత జంతువును చూసినట్టుగా చూస్తున్నారని లలిత్ పాటికర్ వాపోతున్నాడు. తనకు కలిగిన ఈ దుస్థితి మరెవ్వరికీ కూడా రాకూడదని బాధపడుతున్నాడు. జన్యుపరమైన ఇబ్బందులతోనే ఇలా వెంట్రుకలు పెరిగినట్టు వైద్యులు పేర్కొంటున్నారు. ఏం చేసినా అతని వెంట్రుకలు మాత్రం పోయే పరిస్థితి లేదని.. జీవితం మొత్తం వెంట్రుకలతోనే గడాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ విషయంపై ఎలాంటి భయాందోళన అవసరం లేదని వైద్యులు సూచిస్తున్నారు.  

Also Read :  అన్న ఎన్టీఆర్ శ్రీదేవిని ఆ చిత్రంలో వద్దనడం వెనుక ఇంతటి రహస్యం ఉందా..?

Visitors Are Also Reading