Home » ఈ ఫోటోలో ఉన్న ఈ పాప.. ఒక క్రేజీ హీరోయిన్.. చిచ్చర పిడుగు..!!

ఈ ఫోటోలో ఉన్న ఈ పాప.. ఒక క్రేజీ హీరోయిన్.. చిచ్చర పిడుగు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కొంతమంది స్టార్ హీరో హీరోయిన్లకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని మీరు గుర్తుపట్టారా అంటూ వారి అభిమానులు టాస్క్ విసురుతున్నారు.. అలాంటిది ఈ ఫోటోలో ఉన్న ఒక చిన్నారి ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. హీరోయినే కాదు ఆమె ఒక చిచ్చర పిడుగు అని చెప్పవచ్చు.మరి ఆ హీరోయిన్ ఎవరో తెలుసుకుందాం.. ప్రస్తుతం చాలామంది హీరో హీరోయిన్లు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్స్ ను పెంచుకుంటున్నారు.

Advertisement

వారికి సంబంధించిన ఎలాంటి చిన్న విషయమైనా బయట పెడుతూ అందరితో పంచుకుంటున్నారు. ఇక ఈ మధ్యకాలంలో చిన్ననాటి ఫోటోల ట్రెండు బాగా పెరిగిపోయింది. వారి యొక్క చిన్ననాటి జ్ఞాపకాలను అభిమానులతో పంచుకొని ఆనందపడుతున్నారు. అయితే ఈ స్టార్ హీరోయిన్ కూడా తన చిన్ననాటి ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే కుర్ర కారుకు ఎంతో నచ్చే కలర్స్ స్వాతి.. చలాకి హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.. యాంకర్ గా తన కెరీర్ ను ప్రారంభించి ఆ తర్వాత మెల్లిగా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది.

ఇక ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే సినిమాలో త్రిష చెల్లెలుగా నటనతో అందరిని మెప్పించింది అని చెప్పవచ్చు. ఆ హీరో తర్వాత నానితో అష్టా చమ్మ సినిమాలో హీరోయిన్గా చేసింది. ఇలా మొదటి సినిమాతోనే ఎంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ తమిళ ఇండస్ట్రీలో కూడా చాలా సినిమాలు చేసింది. అలాగే స్వాతి నటించిన కార్తికేయ మూవీ కూడా మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు పెళ్లి చేసుకొని సినిమాలకు దూరంగా ఉంటుంది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ కూడా మొదలుపెట్టిందని చెప్పవచ్చు.

also read:

Visitors Are Also Reading