భారతదేశంలో ప్రస్తుతం రకరకాల పండ్లు మార్కెట్‌లో విరివిగా లభిస్తున్నాయి. శీతాకాలం వంటి ప్రతి సీజన్‌కు సరిపోయే సీజనల్ పండ్లు పుష్కలంగా ఉన్నాయి. వేసవిని తీసుకుంటే మామిడి, గుమ్మడికాయ, దోసకాయలు, జీడిపప్పు, నేరేడుపండ్లు, పుచ్చకాయ, కూరగాయలు లభిస్తాయి. వేసవిలో లభించే పండ్లు అన్ని తియ్యగానూ, పులుపుగాను ఉంటాయి. వీటిల మామిడిదే నెంబర్ వన్ స్థానం. తిన్న తరువాత కూడా రుచి నాలుకకు అంటుకుంటుంది. నేరేడు పండ్లు పసిపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమైన పండు. పూర్వకాలంలో నేరేడు పండును ఔషద గుణాలు ఉన్న పండు అని, చెట్టును జంబుక వృక్షం అని కూడా పిలిచేవారట.
Advertisement
ముఖ్యంగా మే, జూన్ మాసాల్లో లభించే ఈ నేరేడు పండు తీపి, పులుపు, ఆస్ట్రిజెంట్ రుచి కలిగిన నేరేడుపండు. సాధారణంగా మే, జూన్‌ల్లో లభిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలకు సెలవుల్లో ఈ పండ్ల కోసం అడవి లేదా రోడ్డు పక్కనే ఉన్న నేరేడు చెట్టును ఆక్రమించే అబ్బాయిలు, బాలికలు చాలా మందే ఉన్నారు. నేరేడు పండు నాలుకకు ఆహ్లాదకరమైన రుచిని అందించడమే కాకుండా వివిధ ఔషద గుణాలతో నిండి ఉంటుంది. ముఖ్యంగా కడుపునొప్పి, మధుమేహం, కీళ్ల నొప్పులు వంటి సమస్యలకు ఈ పండ్లు మేలు చేస్తాయి. పలు ఆరోగ్య లక్షణాలు ఉన్నప్పటికీ నేరేడుపండ్లు కొన్ని దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ అన్ని వర్గాల ప్రజలను ప్రభావితం చేయవు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రమే నేరేడుపండ్లను మితంగా తినాలి లేదా వాటిని పూర్తిగా మానేయాలి.
Advertisement
ఈ పండ్లు రక్తంలో చక్కెర స్థాయిలను బాగా తగ్గిస్తాయి. మీరు నేరేడుపండు ఎక్కువగా తీసుకుంటే మీ రక్తంలో చక్కర పడిపోతుంది. అధిక రక్తపోటును తగ్గించడంలో కూడా సాయపడుతుంది. మోతాదు ఎక్కువైతే రక్తపోటు సమస్య తగ్గుతుంది. నేరేడుపండ్లు జీర్ణ సమస్యలను నయం చేయగలవు. ఎక్కువ పరిమాణంలో తింటే మలబద్ధకం ఏర్పడుతుంది మీ ముఖం మీద మొటిమలు లేదా స్కిన్ ట్యూమర్స్ వంటి సమస్యలు ఉంటే మీరు దీనికి దూరంగా ఉండాలి. చర్మ సమస్యలను తెచ్చిపెడతాయి. నేరేడుపండ్లు ఎక్కువగా తినే కొందరిలో వాంతులు రావచ్చు. ఈ పండ్లు సహజంగా పుల్లని రుచిని కలిగి ఉంటాయి. ఇతర ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు దంత క్షయం సంభవిస్తుంది.
Also Read :
అల్లుఅర్జున్ కు కట్నం ఎంత ఇచ్చారో మీకు తెలుసా..?
Dethadi Harika : దేత్తడి హారిక డ్యాన్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!