Telugu News » అల్లుఅర్జున్ కు క‌ట్నం ఎంత ఇచ్చారో మీకు తెలుసా..?

అల్లుఅర్జున్ కు క‌ట్నం ఎంత ఇచ్చారో మీకు తెలుసా..?

by Anji

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ల‌వ్‌లో ప‌డి ఆ ల‌వ్‌ను కాస్త పెళ్లి పీట‌ల వ‌ర‌కు తీసుకెళ్లిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. అల్లుఅర్జున్‌-స్నేహ‌రెడ్డి ల వివాహం మార్చి 06, 2011న జ‌రిగింది. వీరి పెళ్లి జ‌రిగి 11 ఏండ్లు గ‌డిచింది. ఓవైపు సినిమాలో ఎంత బిజీగా ఉన్న త‌న కుటుంబానికి ఎంతో ప్రాముఖ్య‌తను ఇస్తాడు అల్లుఅర్జున్‌. త‌న భార్య స్నేహారెడ్డి ప‌ట్ల త‌న ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌ర‌చ‌డానికి ఎప్పుడు వెన‌క్కి త‌గ్గ‌డు. ఈ అంద‌మైన జంట‌కు అల్లుఅయాన్ అల్లు అర్హా అనే ఇద్ద‌రు పిల్ల‌లు. స్నేహారెడ్డి అర్జున్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. తాజాగా అల్లుఅర్జున్ మామ బ‌న్ని పై ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసారు.

Ads


అల్లు అర్జున్ మామ పేరు చంద్ర‌శేఖ‌ర్ ఆయ‌న ఓ రాజ‌కీయ వేత్త‌. ఈ త‌రుణంలో తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడారు. అల్లుఅర్జున్‌పై ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసారు. బ‌న్ని అల్లుడుగా వందకు వంద మార్కులు వేశాడని ప్ర‌శంస‌ల వ‌ర్ష‌మే కురిపించాడు. ఇంట్లో ఉన్న‌ప్పుడు బ‌న్ని అనే పిలుస్తాం అని.. బ‌య‌ట‌కు వెళ్లితే మాత్రం అర్జున్ అనే అంటాన‌ని చెప్పాడు. బ‌న్నీ ఓ పాన్ ఇండియా స్టార్‌గా ఎద‌గ‌డం చాలా సంతోషంగా ఉంద‌న్నాడు. రాష్ట్రంలోనే కాకుండా బ‌య‌టి రాష్ట్రాల్లో కూడా బ‌న్నీకి ఫ్యాన్స్ ఉన్నార‌ని చెప్పారు. అల్లుఅర్జున్ అత్త జ‌మ్మూకాశ్మీర్ వెళ్లార‌ని, అక్క‌డ ఎవ‌రో బ‌న్నీ పాట వింటున్నార‌ని చెప్పుకొచ్చారు. అక్క‌డ బ‌న్ని అత్త‌గారు అని తెలియ‌డంతో వెంట‌నే సెల్ఫీలు దిగారు అని చెప్పుకొచ్చారు.


బ‌న్నీకి ఎంత క‌ట్నం ఇచ్చారో చెప్పాల‌ని యాంక‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు ఆయ‌న న‌వ్వుతూ స‌మాధానం ఇచ్చారు. బ‌న్ని క‌ట్న‌మే తీసుకోలేద‌ని చెప్పారు. బ‌న్నికి క‌ట్నం ఇచ్చేంత స్థాయి త‌మ‌కు లేద‌న్నారు. వాళ్ల‌కే ఎక్కువ ఉందంటూ.. అల్లుఅర్జున్ మామ చంద్ర‌శేఖ‌ర్ చెప్పారు. ఇటీవ‌లే పుష్ప స‌క్సెస్ సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ల‌కు హోట‌ల్‌లో చిన్న ట్రీట్ ఇచ్చార‌ని తెలిపారు. ముఖ్యంగా అల్లుఅర్జున్ ఎప్పుడు అంటే అప్పుడు కలుస్తామ‌ని వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం అల్లుఅర్జున్ మామ క‌ట్నం గురించి చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఇక బ‌న్నీ క‌ట్నం తీసుకోలేదా అని అత‌ని అభిమానులు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

Also Read : 

JR NTR BIRTHDAY SPECIAL : మీరెప్పుడూ చూడని JR ఎన్టీఆర్ ఫోటోలు…!

JR NTR BIRTHDAY SPECIAL : మీరెప్పుడూ చూడని JR ఎన్టీఆర్ ఫోటోలు…!

 


You may also like