Home » మిర్చి సినిమాలో అనుష్క ప‌క్క‌న స్టెప్పులు వేసిన ఈ అమ్మాయి ఎవ‌రో గుర్తుప‌ట్టారా..? ప్ర‌స్తుతం ఆమె టాప్ యాంక‌ర్..!

మిర్చి సినిమాలో అనుష్క ప‌క్క‌న స్టెప్పులు వేసిన ఈ అమ్మాయి ఎవ‌రో గుర్తుప‌ట్టారా..? ప్ర‌స్తుతం ఆమె టాప్ యాంక‌ర్..!

by AJAY

Bigg Boss Bhanu Sree: సినిమా ఇండ‌స్ట్రీలో రానించాలంటే ఎంతో టాలెంట్ తో పాటూ బ్యాగ్రౌండ్ మ‌రియు అదృష్టం కూడా ఉండాలి. బ్యాగ్రౌండ్ అదృష్టం లేకుండా టాలెంట్ ఉన్న‌ప్ప‌టికీ ఆఫ‌ర్ లు మాత్రం వెంట‌నే రావు. చాలా క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంది. చాలా మంది సినిమాల‌పై ఉన్న ప్రేమ‌తో ఎలాంటి పాత్ర‌లు వ‌చ్చినా చేస్తుంటారు. సినిమాల్లో రానించ‌డానికి ఎంత క‌ష్టాన్ని అయినా అనుభ‌విస్తారు.

అలా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వ‌చ్చి మొద‌ట సైడ్ డ్యాన‌ర్స్ గా కెరీర్ ప్రారంభించి ప్ర‌స్తుతం యాంక‌ర్ గా న‌టిగా రానిస్తున్న బ్యూటీ భాను శ్రీ. మొద‌ట ఈ ముద్దుగుమ్మ సైడ్ డ్యాన్స‌ర్ గా సినిమాల్లోకి వ‌చ్చింది. అంతే కాకుండా మిర్చి సినిమాలో భాను శ్రీ అనుష్క స్టెప్పులు వేసిన డార్లింగే ఓసినా డార్లింగే పాట‌లో సైడ్ డ్యాన్స‌ర్ గా క‌నిపించింది. ఇక ఆ త‌ర‌వాత చాలా సినిమాల‌లో డ్యాన్స‌ర్ గా చేసింది. అంతే కాకుండా ఆ త‌ర‌వాత సీరియ‌ల్స్ లో న‌టించింది.

Also Read:  18 పేజెస్ మూవీలో బ్రహ్మాజీకి అవమానం.. ఎలా భరించావయ్యా..?

Bigg Boss Bhanu Sree

Bigg Boss Bhanu Sree

ఇక అలాంటి స‌మ‌యంలోనే బిగ్ బాస్ లోకి అడుగుపెట్టే అవ‌కాశాన్ని అందుకుంది. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన త‌ర‌వాత త‌న ముక్కు సూటి తనంతో ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకుంది. బిగ్ బాస్ త‌ర‌వాత చాలా సినిమా ఆఫ‌ర్ ల‌ను అందుకుంది. బిగ్ బాస్ లోకి వ‌చ్చిన త‌ర‌వాత భానుశ్రీ ఆ పాట‌లో క‌నిపించిన వీడియో క్లిప్ ను నెటిజ‌న్ లు వైర‌ల్ చేశారు.

అంతే కాకుండా యాంక‌ర్ గా ఎంట్రీ ఇచ్చి ప‌లు టీవీ షోల‌లో సంద‌డి చేసింది. ప్ర‌స్తుతం యాంక‌ర్ గా కొన‌సాగుతూనే న‌టిగా సినిమాలు చేస్తోంది. ఇండ‌స్ట్రీలో భాను శ్రీ మాదిరిగా ఎదిగిన వాళ్లు చాలా త‌క్కువ మంది ఉంటారు. కాబ‌ట్టి భాను శ్రీ రియ‌ల్ లైఫ్ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి రావాలి అనుకునే చాలా మందికి ఆద‌ర్శం అనే చెప్పాలి.

Also Read: యాంక‌రింగ్ కు సుమ గుడ్ బై….కార‌ణం అదేనా..?

Visitors Are Also Reading