Home » జామపండ్లని వీళ్ళు అస్సలు తీసుకోకూడదు… ఎంతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది..!

జామపండ్లని వీళ్ళు అస్సలు తీసుకోకూడదు… ఎంతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది..!

by Sravya

చాలామంది ఆరోగ్యంగా ఉండడానికి అనేక పండ్లుని డైట్లో తీసుకుంటూ ఉంటారు. మనకి దొరికే పండ్లు, కూరగాయలు ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. జామ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జామపండు జీర్ణ క్రియకి వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి ఎంతో మేలు చేస్తాయి. జామ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, కెరోటిన్, పొటాషియం కూడా ఉంటాయి. జామ పండ్లు తీసుకోవడం వలన 112 క్యాలరీలు అందుతాయి. 23 గ్రాముల కార్బోహైడ్రేట్స్ జామ పండు లో ఉంటాయి.

కడుపు ఉబ్బరంగా ఉంటే జామ పండును తీసుకోకండి. ఎక్కువ మూత్రం వెళ్లే వాళ్ళు కూడా జామ పండ్లకు దూరంగా ఉండడం మంచిది. రాత్రి పూట జామ పండ్లను తినడం మంచిది కాదు. బాగా ఎక్కువగా జామ పండ్లు తీసుకుంటే షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. దంతాల చిగుళ్ల సమస్యలు ఉన్నవాళ్లు జామపండులను తీసుకోవద్దు. రాత్రిపూట జామ పండ్లు తీసుకుంటే జలుబు, దగ్గు వచ్చే అవకాశం ఉంటుంది. జామకాయలులో 80 శాతం నీళ్లు ఉంటాయి. జామలో కూడా అరటిపండ్లలో ఎంత పొటాషియం ఉంటుందో అంత పొటాషియం ఉంటుంది.

Also read:

Visitors Are Also Reading