Home » ప్రకాష్ రాజ్ చేసిన తప్పేంటి..? ఎందుకు ప్రకాష్ రాజ్ మాత్రమే ఇన్ని సార్లు బ్యాన్ అవుతున్నారు..?

ప్రకాష్ రాజ్ చేసిన తప్పేంటి..? ఎందుకు ప్రకాష్ రాజ్ మాత్రమే ఇన్ని సార్లు బ్యాన్ అవుతున్నారు..?

by Sravya

ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రకాష్ రాజ్. చాలామంది టాప్ దర్శక, నిర్మాతలు వాళ్ళ సినిమాలో ప్రకాష్ రాజ్ వుండాలని అనుకుంటారు. ప్రకాష్ రాజ్ కి అభిమానులు కూడా ఎక్కువే. అయితే ప్రకాష్ రాజ్ మంచి నటుడు అయినా దర్శకులకి మాత్రం పెద్ద బరువుగా మారిపోయారు ప్రకాష్ రాజ్. ఆయన సినిమాలో నటించాలంటే ఎన్నో కండిషన్స్ పెడుతూ ఉంటారట లేదంటే ఆయన చేసే గొడవలు కూడా భరించాల్సి వస్తుందట. ఈ విషయాన్ని చాలామంది అధికారికంగా ఇప్పటికే చెప్పారు.

prakash raj

prakash raj

అనధికారికంగా ప్రకాష్ రాజ్ ని బ్యాన్ చేస్తూ ఉన్నారు. షూటింగ్ కి టైం కి ఎప్పుడు కూడా ప్రకాష్ రాజ్ రాడట. రాగానే ఏదో ఒక గొడవ పెట్టుకుంటారట. దర్శకుడు చెప్పినట్లు కూడా సరిగ్గా చేయరట. కెమెరా స్విచ్ ఆన్ అయితే చాలు అతనిలో ఇంకో కోణం బయటికి వస్తుంది ప్రకాష్ రాజ్ క్లోజ్ ఫ్రెండ్ కృష్ణవంశీ చాలాసార్లు ఆయనని సినిమాలో పెట్టుకుంటే పని అయిపోయినట్లే అని చెప్పారు. ఆగడు సినిమా టైంలో సోను సూద్ ప్లేస్ లో ప్రకాష్ రాజ్ ని అనుకున్నారు. కానీ శ్రీను వైట్ల ప్రకాష్ భరించలేక ఆయన సీన్స్ ని అన్నీ కూడా తీసేసి సోనుసూద్ ని పెట్టుకుని సినిమా పూర్తి చేశారట. ఇలా చాలా సందర్భాల్లో ప్రకాష్ రాజ్ బ్యాన్ అవుతూ వచ్చారు.

Also read:

Visitors Are Also Reading