Home » గత పదేళ్లుగా టెస్టుల్లో టీమిండియా తిరుగులేని రికార్డులు ఇవే..!

గత పదేళ్లుగా టెస్టుల్లో టీమిండియా తిరుగులేని రికార్డులు ఇవే..!

by Anji
Ad

ప్రస్తుతం భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతోంది. నాగపూర్ వేదికగా జరిగిన జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 1-0 తేడాతో ఆధిక్యంలోకి దూసుకుపోయింది. ముఖ్యంగా సొంతగడ్డ పై టీమిండియా మరో ఘన విజయం సాధించింది. గత పదేళ్లుగా స్వదేశంలో టెస్ట్ మ్యాచ్ లు ఆడుతూ అత్యంత విజయవంతమైన జట్టుగా భారత్ నిలిచింది. పదేళ్లుగా స్వదేశంలో జరిగినటువంటి టెస్ట్ మ్యాచ్ లలో 81.4 శాతం విజయాలను సాధించింది. ఇక అదే సమయంలో విదేశీ టెస్ట్ మ్యాచ్ లలో మాత్రం 38.9 శాతం విజయాలను సాధించింది. 

Advertisement

2013 నుంచి టెస్టుల్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండిస్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి జట్లను భారత్ ఓడించింది. ఇక ఇదే సమయంలో విదేశీ గడ్డపై ఆడుతున్న సమయంలో భారత జట్టు పలు జట్ల చేతిలో ఓటమిని చవిచూసింది. 2013లో భారత్ లో ఆడిన బోర్డర్-గవాస్కర్ ట్రోపీలో భారత జట్టు 4-0 ఆస్ట్రేలియాను ఓడించింది. ఆ తరువాత 2016-17 దేశవాలీ బోర్డర్-గవాస్కర్ ట్రోపీలో మరోసారి 2-1 తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. 

Advertisement

Also Read :  క్రికెటర్లు లంచ్ బ్రేక్ లో ఏం తింటారో తెలుసా?

Manam News

మరో విశేషమేంటంటే.. ఈ ఏడాది ఆడే దేశవాళి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మరోసారి టీమిండియా ఆధిపత్యం కనబరుస్తోంది. నాగ్ పూర్ లో జరిగిన తొలి మ్యాచ్ లో భారతజట్టు మూడో రోజునే ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా జట్టును ఓడించింది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసినటువంటి ఆస్ట్రేలియా 177 పరుగులు మాత్రమే చేసింది. దీంతో భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో 400 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తరువాత బరిలోకి దిగినటువంటి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో 91 పరుగులకు ఆలౌట్ అయింది.  రెండో టెస్ట్ ఢిల్లీ వేదికగా జరుగనుంది. 

Also Read :  Ind Vs Aus : తోక ముడిచిన ఆసీస్… ఇన్నింగ్స్ తేడా టీమిండియా భారీ విజయం

Visitors Are Also Reading