Home » నాగ‌ చైత‌న్య స్టార్ హీరో ఎందుకు కాలేక‌పోతున్నాడు.? 6 కార‌ణాలు.

నాగ‌ చైత‌న్య స్టార్ హీరో ఎందుకు కాలేక‌పోతున్నాడు.? 6 కార‌ణాలు.

by Anji
Ad

అక్కినేని వంశానికి మూడోత‌రం న‌ట వార‌సులు నాగ‌చైత‌న్య‌, అఖిల్‌లు… వీరిద్ద‌రూ హీరోయిలుగా స‌క్సెస్ అయిన‌ప్ప‌టికీ స్టార్ హీరో ఇమేజ్ మాత్రం ద‌క్కించుకోలేదు.అఖిల్ గురించి ప‌క్క‌కు పెడితే నాగ‌చైత‌న్య‌కు స్టార్ హీరో అనిపించుకునే స‌త్తా ఉన్న‌ప్ప‌టికీ అత‌ను చేస్తున్న కొన్ని త‌ప్పుల కార‌ణంగా స్టార్ డ‌మ్ ను అందుకోలేక‌పోతున్నాడు.

Also Read:  గుడివాడ ప్ర‌జ‌ల‌కు గోవా ఫీలింగ్…కొడాలి పై ఆర్జీవీ సెటైర్లు..!

Advertisement

Naga Chaitanya: She and I Am Happy Now

స్టార్ డైరెక్ట‌ర్ :
హీరోని స్టార్ హీరోగా మార్చాలంటే కాస్త పేరు ఉన్న డైరెక్ట‌ర్ల‌తో సినిమా చేయాలి. ఆడియ‌న్స్ ప‌ల్స్ తెలిసిన ద‌ర్శ‌కుల‌తో ప్రాజెక్ట్ చేయాలి. కానీ చైత‌న్య ఎక్కువ‌గా కొత్త ద‌ర్శ‌కుల‌తోనే త‌న సినిమాలు చేశాడు. త‌న హిట్ సినిమా అయిన ఏమాయ‌చేశావే డైరెక్ట్ చేసిన ద‌ర్శ‌కుడు గౌత‌మ్‌మీన‌న్ స్టార్ డైరెక్ట‌ర్ కానీ క‌మ‌ర్షియ‌ల్ గా హీరోని నిల‌బెట్టగ‌ల‌ డైరెక్ట‌ర్ అయితే కాదు.

Prime Video: Ye Maya Chesave

మాస్ సినిమాలు :
ఒక హీరోను మాస్ హీరోగా నిల‌బెట్టాలంటే ఆ డైరెక్ట‌ర్‌కు మాస్ ప‌ల్స్ బాగా తెలిసి ఉండాలి. మాస్ డైరెక్ట‌ర్‌గా త‌న‌కు పేరు ఉండాలి. పూరిజ‌గ‌న్నాథ్‌, వి.వి.వినాయ‌క్‌, బోయ‌పాటి లాంటి వారు అందులో అనుభ‌వజ్ఞులు. చైత‌న్య చేసే మాస్ సినిమాల‌న్నీ కొత్త డైరెక్ట‌ర్ల‌తో చేసిన‌వే! ద‌డ‌, బెజ‌వాడ, ఆటోన‌గ‌ర్ సూర్య‌, స‌వ్య‌సాచి వంటి సినిమాలు వాటికి ఉదాహ‌ర‌ణ‌లు. మాస్ సినిమా అని అభిమానులు హై ఎక్స్‌పెక్టేష‌న్‌తో రావ‌డం డిస్సాపాయింట్‌తో వెళ్ల‌డం చైత‌న్య విష‌యంలో కామ‌న్ అయిపోయింది.

Dhada Telugu Movie Review Naga Chaitanya Akkineni Kajal Agarwal

కో స్టార్ కు స్కోప్ ఎక్కువ‌:
చైత‌న్య హిట్ మూవీస్ చూస్తే…. అందులో హీరో కంటే హీరోయిన్స్‌కే ఎక్కువ‌గా ప్రాధాన్య‌త ఉంటుంది. దానివ‌ల్ల ఆటోమేటిక్‌గా హీరోయిన్ పాత్ర‌కే ఎక్కువ‌గా పేరు వ‌స్తుంది. ఏమాయ చేసావే, 100 %ల‌వ్‌, మ‌జిలీ సినిమాలు ఆ కోవకు చెందిన‌వే.ఆ సినిమాలు హిట్ అయినా క్రెడిట్ మాత్రం హీరోయిన్ల‌కే ద‌క్కింది.

Advertisement

ఛాయిస్ :
నాగార్జున కింగ్ సినిమా తీసిన త‌రువాత శ్రీ‌నువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో ఒక సినిమా అనుకున్నారు. అయితే చైత‌న్య అక‌స్మాత్తుగా ఆ మూవీ నుంచి త‌ప్పుకున్నాడు. దీంతో బిజినెస్ మ్యాన్ స‌మ‌యంలో పూరిజ‌గ‌న్నాథ్ ఓ స్టోరి చెబితే ఆ మూవీ నుంచి త‌ప్పుకున్నాడు. బోయ‌పాటి శ్రీ‌నుతో సైతం ఒక స్టోరిని డిస్క‌ష‌న్ స్టేజిలోనే వ‌దిలేసాడు. ఢ‌మరుకం శ్రీ‌నివాస్‌రెడ్డితో దుర్గ‌, హ‌లోబ్ర‌ద‌ర్ మూవీల‌ను అనౌన్స్ చేసి త‌రువాత వాటి నుంచి త‌ప్పుకున్నాడు. దుర్గ టైటిల్‌తో వివివినాయ‌క్ అప్రోచ్ అయితే అది కూడా రిజెక్ట్ చేశాడు నాగ‌చైత‌న్య‌.

Yuddham Sharanam Review, Yuddham Sharanam Movie Review Ratings

మొహ‌మాటం:
ఫ్రెండ్స్ అనో, రిలేటివ్స్ అనో మొహ‌మాటానికి పోయి కొన్ని సినిమాలు చేసాడు. ద‌డ‌, సాహ‌సం, శ్వాస‌గా సాగిపో, యుద్ధం శ‌ర‌ణం గ‌చ్చామి లాంటి సినిమాలు అలాంటి కోవాకు చెందిన కావ‌డం విశేషం.

Naga Chaitanya wanted to tie the knot with this actress! Not Samantha

ఆడియ‌న్స్ ను ఎంగేజ్ చేయ‌క‌పోవ‌డం:
ఒక సినిమా విడుద‌లైతే ఎక్కువ‌గా హంగామా చేసి ఓపెనింగ్స్ తెప్పించేది అభిమానులు. అంద‌రి హీరోలు అభిమానుల‌ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తారు. అందుకే వారి సినిమాలు ప్లాప్ అయినా స‌రే కానీ నెక్ట్స్ సినిమాకు అదే ఓపెనింగ్స్ ఉంటాయి. చైత‌న్య అభిమానుల‌తో అంత‌గా ట‌చ్‌లో ఉన్న‌ట్టు అస‌లు క‌నిపించ‌రు. ఆడియో ఫంక్ష‌న్‌ల‌లో కూడా చాలా సైలెంట్‌గా ఉంటూ క‌నిపిస్తాడు. అక్కినేని ఫ్యామిలీకి ఉన్న‌ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉప‌యోగించుకోవాలో చైతూకు తెలియ‌డం లేదు.

నాగ‌చైత‌న్య‌కు యాక్టింగ్ స్కిల్స్ పుల్ ఉన్నాయి. 100 కోట్ల గ్రాస్ కొట్టే స‌త్తా కూడా ఉంది. కానీ ఎందుకో అత‌డింకా స్టార్ హీరో స్థాయికి ఎద‌గ‌లేదు. నాగ‌చైత‌న్య గ‌ట్టిగా నిల‌బెట్టే సినిమా ఎప్పుడు వ‌స్తుందో చూడాలి మ‌రి.

Also Read: కొత్త బంగారు లోకం హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..!

Visitors Are Also Reading