దేశవ్యాప్తంగా 2022లో కొన్ని సినిమాలు మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. వాటిలో తెలుగు నుంచి ఆర్ఆర్ఆర్, కన్నడం నుంచి కేజీఎఫ్ 2, కాంతార, తమిళం నుంచి పీఎస్ 1, హిందీ నుంచి బ్రహ్మాస్త 1 వంటి సినిమాలు ఉన్నాయి. వీటిలో కన్నడ సినిమాలకే ఎక్కువ క్రేజ్ రావడం విశేషం. కేజీఎఫ్ 2, కాంతార సినిమాలు కన్నడ సినిమాలు ఈ సినిమాలు పాజిటివ్ టాక్ తో దేశవ్యాప్తంగా కలెక్షన్ల పరంగా రికార్డును క్రియేట్ చేశాయి.
కేజీఎఫ్ 2
Advertisement
కన్నడకి చెందిన ఈ సినిమా రూ.150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. తెలుగు, తమిళం, మలయాళంలతో పాటు హిందీ భాషల్లో కూడా విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా గ్రాస్ రూ.1228.3 కోట్లు వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా షేర్ రూ.625.4 కోట్ల షేర్ రావడం విశేషం.
ఆర్ఆర్ఆర్
దర్శకుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాని తెరకెక్కించారు. టాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ఇది. రూ.425 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.1131.1 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 611.3 కోట్ల షేర్ వసులు చేసింది ఆర్ఆర్ఆర్.
పొన్నియిన్ సెల్వన్ 1
తమిళ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ 1 చిత్రం దేశవ్యాప్తంగా మంచి గుర్తింు తెచ్చుకుంది. రూ.210 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.500.8 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. అదేవిధంగ ప్రపంచ వ్యాప్తంగా 242.6 కోట్లు షేర్ వసూలు చేసింది.
విక్రమ్
తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా కూడా మంచి రికార్డునే క్రియేట్ చేసింది. రూ.115 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన విక్రమ్ మూవీ రూ.424.5 కోట్ల గ్రాస్ వసూలు . చేసింది. ప్రపంచవ్యాప్తంగా 215.1 కోట్ల షేర్ రావడం విశేషం.
బ్రహ్మాస్త్ర
Advertisement
దాదాపు రూ.315 కోట్లతో తెరకెక్కిన బ్రహ్మాస్త్ర సినిమా ప్రపంచవ్యాప్తంగా 412.7 కోట్ల గ్రాస్ బిజినెస్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 181.3 కోట్ల షేర్ వసూలు చేసింది.
కాంతార
కేవలం 15 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన కాంతార సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో రూ.371.4 కోట్ల గ్రాస్ వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 179.1 కోట్ల షేర్ వసూలు చేయడం విశేషం.
ది కాశ్మీర్ ఫైల్స్
రూ.20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 344.2 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా షేర్ రూ.150.7 కోట్ల షేర్ రావడం విశేషం.
భూల్ భూలయ్యా 2
ఈ చిత్రం 75 కోట్లతో తెరకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా 263.9 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అదేవిధంగా 115.4 కోట్ల షేర్ రావడం విశేషం.
బీస్ట్
దాదాపు రూ.130 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది ఈ చిత్రం. ప్రపంచవ్యాప్తంగా 227.3 గ్రాస్ వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 116.8 కోట్ల షేర్ వసూలు చేసి మంచి లాభాలను తెచ్చుకుంది.
Also Read : ఉదయ్ కిరణ్ ఆకస్మిక మరణానికి కారణమేమిటో తెలుసు నిజాలన్నీ బయటపెడతా !
గంగుబాయి కతియా వాడి
ఈ చిత్రం రూ.125 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా రూ.203.9 కోట్ల క్రాస్ వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 90.5 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ చిత్రం.
Also Read : కృష్ణ తన కూతురు వివాహానికి సీఎం జయలలితను రావద్దని చెప్పిన కృష్ణ..అలా ఎందుకు చేశారంటే..?