Home » కృష్ణ త‌న కూతురు వివాహానికి సీఎం జ‌య‌ల‌లిత‌ను రావ‌ద్ద‌ని చెప్పిన కృష్ణ‌..అలా ఎందుకు చేశారంటే..?

కృష్ణ త‌న కూతురు వివాహానికి సీఎం జ‌య‌ల‌లిత‌ను రావ‌ద్ద‌ని చెప్పిన కృష్ణ‌..అలా ఎందుకు చేశారంటే..?

by AJAY
Ad

సూపర్ స్టార్ కృష్ణ ఆదివారం గుండెపోటుతో హైదరాబాదులోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు. కాగా పరిస్థితి విషమించడంతో ఆయన ఆసుపత్రిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. అప్పటికే ఘట్టమనేని ఫ్యామిలీలో కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు మరియు గత నెల కృష్ణ మొద‌టి భార్య ఇందిరా దేవి మరణించడంతో విషాదం నిండుకుంది. ఆ షాక్ నుండి కుటుంబం బ‌య‌ట‌కు రాక‌ముందే కృష్ణ సైతం గుండెపోటుతో మరణించడం ఆ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టివేసింది.

Also Read:   నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక జీవితంలో అన్ని క‌ష్టాలు అనుభవించిందా…? చివ‌రికి ఇంటి అద్దె కూడా కట్ట‌లేక‌..!

Advertisement

ఇక ఆయ‌న క‌న్నుమూసిన త‌ర‌వాత‌ కృష్ణ నట ప్రస్థానం గురించి.. ఆయన రాజకీయ జీవితం గురించి అనేక విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. అభిమానులు కృష్ణని గుర్తు చేసుకుంటూ ఆయనకు సంబంధించిన అన్ని విషయాలను చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సూపర్ స్టార్ కృష్ణ తమిళనాడు సీఎం జయలలితను తన పెద్ద కూతురు వివాహానికి రావద్దని చెప్పడం కూడా హాట్ టాపిక్ గా మారింది. అసలు కృష్ణ జయలలితను ఎందుకు పెళ్లికి రావద్దని చెప్పారు అన్న వివరాలు ఇప్పుడు చూద్దాం…

Also Read:  తండ్రి కన్నుమూసిన రోజే మరొకరికి ప్రాణం పోసిన మహేష్ బాబు…. నెట్టింట ప్రశంసల జల్లు ..!

Advertisement

కృష్ణ తన పెద్ద కూతురు పద్మావతి వివాహాన్ని జయదేవ్ గల్లాతో జరిపించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ వివాహ వేడుక మద్రాస్ లో జరిగింది. ఈ వివాహానికి సినీ రాజకీయ ప్రముఖులు విచ్చేసి నవ దంపతులను ఆశీర్వదించారు. ఈ వివాహానికి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను సైతం కృష్ణ ఆహ్వానించారు. జయలలిత కూడా పెళ్లికి కచ్చితంగా వస్తానని కృష్ణకు మాటిచ్చారట. దానికి కారణం వారి ఇద్దరి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలే. కృష్ణ జలలిత కలిసి గూడచారి 116 అనే సినిమాలో నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాల్లోనూ కృష్ణ జయలలిత కలిసి నటించారు.

అయితే జ‌య‌ల‌లిత‌ రాజకీయాల్లోకి వెళ్లి సీఎం స్థాయికి ఎదిగిన తర్వాత ఆమెకు జెట్ సెక్యూరిటీని కల్పించారు. దాంతో ఆమె ఎక్కడకి వెళ్లినా ముందుగా ఆ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించి సెక్యూరిటీ సిబ్బంది ఓకే చెబితేనే అక్కడికి వెళ్లేవారు. ఈ నేపథ్యంలోనే జయలలిత సెక్యూరిటీ కృష్ణ కూతురు పెళ్లి మండపానికి వచ్చారు. దాంతో కృష్ణతో సహా మొదటి మూడు వరసల‌లో కూర్చున్న అతిథులు అందరినీ లేపాల్సి వచ్చింది. ఆ మూడు వరుసల్లో సినీ రాజకీయ ప్రముఖులు కూర్చున్నారు. అయితే వారందరిని లేచి నిలబడమనటం కృష్ణకు ఇష్టం లేదట. దాంతో జ‌య‌ల‌లిత‌కు ఫోన్ చేసి…. మీరు పెళ్లికి రావద్దు మీ ఆశీర్వచనాలు ఉంటే సరిపోతుంది అని చెప్పారట. దానికి జయ‌లలిత కూడా అపార్థం చేసుకోకుండా…. సరే అని తన పీఏతో నూతన దంపతులకు బొకేను పంపించారట.

Also Read:   దక్షిణ దిశలో ఈ 5వస్తువులు ఉన్నాయా? అయితే వెంటనే తొలగించండి.. లేదంటే ప్రమాదం!

Visitors Are Also Reading