టాలీవుడ్ సీనీ ఇండస్ట్రీలో కెమెరా మెన్ గా కెరీర్ ని ప్రారంభించి.. ప్రస్తుతం ఓ టాప్ డైరెక్టర్లలో ఒకరిగా కొనసాగుతున్నాడు తేజ. తాను దర్శకుడిగా తీసిన మొదటి సినిమా చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక ఈ సినిమా ద్వారానే దివంగత హీరో ఉదయ్ కిరణ్ ని సీని ఇండస్ట్రీకి పరిచయం చేసాడు తేజ. ఉదయ్ కిరణ్ ని మాత్రమే కాకుండా రీమా సేన్, సదా, కాజల్, నవదీప్, సుమన్ శెట్టి వంటి నటీనటులతో పాటు ఆర్.పీ. పట్నాయక్ వంటి సంగీత దర్శకులను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.
ఉదయ్ కిరణ్ విషయానికొస్తే.. చిత్రం, నువ్వు నేవు, మనసంతా నువ్వే చిత్రాలతో మంచి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అప్పట్లో ఉదయ్ కిరణ్ కి లేడీ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉందనే చెప్పవచ్చు. ఉదయ్ ని లవర్ బాయ్ గా పిలిచేవారు. ఒక హీరో తరువాత వరుసగా కొన్ని ఫ్లాప్ లు రావడంతో కుంగిపోయాడు. అదే సమయంలో పెళ్లి చేసుకున్నాడు. ఇక ఆ తరువాత ఏమైందో ఏమో తెలియదు కానీ అకస్మాత్తుగా ఉదయ్ కిరణ్ తన నివాసంలో ఉరేసుకున్నాడు.
Also Read : త్రివిక్రమ్ నమ్మించి మోసం చేశాడంటున్న నటి ప్రేమ.. కారణం..!!
Advertisement
అప్పట్లో ఉదయ్ కిరణ్ మరణంపై రకరకాలుగా వార్తలు వినిపించాయి. చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వడం, కొత్త సినిమాలు ఏవి రాకపోవడంతో చనిపోయాడని కొంత మంది, ఉదయ్ మరణించడం వెనుక పెద్దల హస్తం ఉందని కొంత మంది, భార్యతో విభేదాలు అని మరికొందరూ ఇలా రకరకాలుగా కామెంట్స్ చేశారు. ఉదయ్ కిరణ్ మరణానికి అసలు కారణం ఇప్పటి వరకు తెలియలేదు. తాజాగా దర్శకుడు తేజ ఉదయ్ కిరణ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తేజ ఉదయ్ కిరణ్ గురించి ఏం చెప్పాడో ఇఫ్పుడు మనం తెలుసుకుందాం.
Also Read : స్టైల్ కోసం కాదట…కృష్ణ కూలింగ్ గ్లాస్ లు ఎందుకు ధరించేవారో తెలుసా..?
ఉదయ్ కిరణ్ చాలా సున్నితమైన మనస్తత్వం కలవాడు అని, వరసగా మూడు హిట్ సినిమాలు వచ్చేటప్పటికీ బ్యాలెన్స్ కోల్పోయాడని, ఒక్కసారిగా వచ్చిన స్టార్ డమ్ ని తట్టుకోలేక పోయాడని చెప్పారు. వరుసగా ఫ్లాప్ లు రావడంతో ఉదయ్ ఉక్కిరిబిక్కిరి అయి డిప్రెషన్ కి గురయ్యాడని తెలిపారు. ఉదయ్ కి వరుస ఫ్లాప్ లు వస్తున్న సమయంలోనే ఔనన్నా కాదన్నా సినిమా చేసినట్టు గుర్తు చేశారు. ఉదయ్ చనిపోయే ముందు తనకు ఫోన్ చేశాడని, జరిగిందంతా మొత్తం చెప్పాడని తెలిపారు. అవన్నీ ఇప్పుడు బయటపెట్టనని, సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెబుతానని వెల్లడించారు.తాను చనిపోయే లోపు ఉదయ్ కిరణ్ మరణానికి గల కారణాలను వెల్లడిస్తానని తేజ చెప్పారు. దర్శకుడు తేజ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
Also Read : నమ్రత తండ్రి ఓ స్టార్ క్రికెటర్ అన్న సంగతి తెలుసా..? ఆయన ఎవరంటే..?