Home » దళపతి విజయ్ గురించి ఎవ్వరికీ తెలియని రహస్యాలు ఇవే..!

దళపతి విజయ్ గురించి ఎవ్వరికీ తెలియని రహస్యాలు ఇవే..!

by Anji
Ad

భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా రేంజ్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో దళపతి విజయ్ ఒకరు. ఈయనకు తమిళంతో పాటు తెలుగు, హిందీలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విజయ్ సినిమాల కోసం సౌత్, నార్త్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. బాలనటుడిగా ఇండస్ట్రీకి అడుగుపెట్టి స్టార్ డమ్ సంపాదించుకున్నారు. అభిమానులతో దళపతి అని పిలిపించుకున్న విజయ్ పుట్టిన రోజు ఇవాళ. సోషల్ మీడియా వేదికగా తమ అభిమాన హీరోకు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు.  విజయ్ గురించి ఇప్పటివరకు చాలా మందికి తెలియని రహస్యాలను మనం తెలుసుకుందాం. 

Advertisement

విజయ్ 1974 జూన్ 22న మద్రాస్ లో జన్మించారు. ఆయనను సినీ ప్రపంచానికి పరిచయం చేసింది మాత్రం తండ్రి ఎస్.ఏ.చంద్రశేఖర్. బాలనటుడిగా 1984లో పలు చిత్రాల్లో నటించారు విజయ్. 1984 నుంచి 1988 వరకు విజయ్ 6 సినిమాల్లో బాలనటుడిగా నటించారు. ప్రధానంగా తన తండ్రి నిర్మించిన చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించాడు. 1992లో నాలయ గడ్డి మూవీతో హీరోగా తెరంగేట్రం చేశారు. విజయ్ దళపతికి మాస్ హీరోగా అభిమానుల్లో ఫుల్ ఫాలోయింగ్ ఏర్పడింది. అదేవిధంగా సొంతంగా విజయ్ పీపుల్స్ మూవ్ మెంట్ అనే సామాజిక సంక్షేమ సంస్థను కూడా ప్రారంభించారు. ఆయన అభిమానులు ప్రతీ ఏడాది రక్తదాన కార్యక్రమాల్లో పాల్గొంటారు. 

Advertisement

 

నటుడు రజినీకాంత్ లేకపోతే తాను సినీ ప్రపంచంలోకి అడుగుపట్టేవాడినే కాదని ఎప్పుడు అంటుంటాడు విజయ్. ఎందుకు అంటే విజయ్ రజినీకి వీరాభిమాని. అదేవిధంగా విజయ్ కి తన చెల్లెలు విద్య అంటే చాలా ఇష్టం. విజయ్ కి తొమిదేళ్ల వయస్సులోనే చెల్లెలు చనిపోవడం అతనిపై తీవ్ర ప్రభావం చూపింది. తన చెల్లెలు గౌరవార్థం, విజయ్ తన నిర్మాణ సంస్థకు చెల్లి పేరు పెట్టుకున్నారు. విజయ్ నిర్మాణ సంస్థ పేరు వివి ప్రొడక్షన్స్ విద్యా–విజయ్ ప్రొడక్షన్స్. తమిళ్ స్టార్ హీరో అయినా బాలీవుడ్ సినిమాల్లో అతిథి పాత్రలు చేసారు విజయ్. అక్షయ్ కుమార్ రౌడి రాథోర్ మూవీలో చిందా దాదా పాట చివరలో అక్షయ్ తో కలిసి చిన్న డ్యాన్స్ చేశాడు. అల్లు అర్జున్ కాకుండా కేరళలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక తమిళ నటుడు విజయ్ మాత్రమే అని చెప్పవచ్చు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

స్వాతంత్రం అంటే ఎవరో ఇచ్చే కాదు.. లాక్కునేది.. ఆసక్తి రేపుతున్న స్పై మూవీ ట్రైలర్

 రవితేజ అంత చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నారా? పెళ్లి నాటికి ఆమె వయస్సు ఎంతంటే.. ?

Visitors Are Also Reading