ప్రతి రోజు బ్యాంకింగ్, ఇతర రంగాల్లో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. కొత్త కొత్త నిబంధనలను అమలులోకి వస్తుంటాయి. అదేవిధంగా జులై 01 నుంచి కొన్ని కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. నూతన లేబర్ కోడ్‌లు అమలు అవ్వనున్నాయి. దీంతో వివిధ సంస్థల ఉద్యోగులు, కంపెనీల కార్మికులు వేతనం, పని గంటలతో పాటు వివిధ వర్గాల వారిపై వడ్డించే పన్నులు వంటివి మారనున్నాయి.
నూవెంజ్ కోడ్‌తో పాటు నూతన కార్మికచట్టాలు అమలు చేయడంతో ఉద్యోగి, కార్మికుడు ప్రతి నెల వేతనం , ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ కంట్రిబ్యూషన్ వచ్చే నెల 01వ తేదీ నుంచి మారిపోనున్నాయి. పని గంటల్లో పెరుగుదల, ప్రైవేట్ కంపెనీల ఉద్యోగుల వేతనాలు తగ్గుముఖం పడుతాయి. సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లు, డాక్టర్లపై టీడీఎస్ నిబంధనలు, ఇతర రూల్స్ కూడా మారనున్నాయి. టీడీఎస్ కొత్త నిబంధన కింద కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు మార్గదర్శకాఉల జారీ చేసింది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నాలుగు లేబర్‌కోడ్‌ల కింద నిబంధనలు ఖరారు చేయలేదు. ఇప్పటి వరకు 3 రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వేజ్ కోడ్‌ల కింద ముసాయిదా నిబంధనలు ప్రచురించినట్టు కేందర కార్మికశాఖ మంత్రి రామేశ్వర్ పార్లమెంట్ సమావేశాల్లో ఇటీవల లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు.
Advertisement
Advertisement
ఇక వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు డియర్ నెస్ అలవెన్స్ పెరుగనుంది. ప్రతి యేటా జనవరి, జులై లో కేంద్రం డీఏను విడుదల చేస్తోంది. అదేవిధంగా సైబర్ నేరాలను కూడా అరికట్టడానికి డెబిట్, క్రెడిట్ కార్డులపై రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా అమలు చేయనున్న టోకేనైజేషన్ వ్యవస్థ తొలుత జూన్ 30తోనే ముగియాల్సి ఉంది. పారిశ్రామిక కంపెనీల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై జారీ చేసే టోకెనైజేషన్ అమలును సెప్టెంబర్ 30 వరకు వాయిదా వేసింది.
Also Read :
గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సులో ”మనసానమః”