Home » ఆచార్య, అంజి తో సహా మెగాస్టార్ కెరీర్ లో డిజాస్టర్ నిలిచిన సినిమాలు ఇవే..!

ఆచార్య, అంజి తో సహా మెగాస్టార్ కెరీర్ లో డిజాస్టర్ నిలిచిన సినిమాలు ఇవే..!

by Anji
Published: Last Updated on
Ad

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు తరువాత స్వయంకృషితో తనకంటూ ఓ సామ్రాజ్యాన్నే ఏర్పరుచుకుంటారు. ఈయన కెరీర్ లో చాలా బ్లాక్ బస్టర్స్ లో పాటు సూపర్ హిట్ సినిమాలున్నాయి. ఈతరంలో ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ అందించిన ఘటన మెగాస్టార్ దే. ఇతని కెరీర్ లో బ్లాక్ బస్టర్స్ తో పాటు ఆరేంజ్ లో డిజాస్టర్స్ సినిమాలున్నాయి. గత ఏడాది ఆచార్య సినిమాతో మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో డిజాస్టర్ గా నిలిచిపోయింది. చిరంజీవి కెరీర్ లో డిజాస్టర్స్ గా నిలిచిన సినిమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఆచార్య 

Advertisement

మెగా తండ్రి తనయులైన మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా పూర్తి స్థాయిలో మొదటిసారి నటించిన ఆచార్య మూవీ ఫస్ట్ డే నుంచే కలక్షన్లు రాబట్టలేకపోయింది. కలెక్షన్లు దారుణమైన టాక్ తెచ్చుకుంది. మెగా క్రౌడ్ పుల్లర్ హీరోలు ఉన్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఓవరాల్ గా నిర్మాతలకు ఈ మూవీ రూ.80కోట్ల వరకు నష్టాలను మిగిల్చింది. 

శంకర్ దాదా జిందాబాద్ 

manam News

హిందీలో సంజయ్ దత్ హీరోగా హిట్ అయిన లగేరహో మున్నాభాయ్ మూవీని తెలుగులో చిరంజీవి శంకర్ దాదా జిందాబాద్ గా రీమేక్ చేశారు. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం. 

అంజి 

Manam News

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కోడిరామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అంజి. శ్యామ్ ప్రసాద్ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ మూవీని హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ సినిమాను ప్రేరణగా తీసుకొని తెరకెక్కించారు.

మృగరాజు 

Manam News

మెగాస్టార్ చిరంజీవి హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో దేవీవరప్రసాద్ నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. మృగరాజు మూవీ హాలీవుడ్ మూది ది హోస్ట్ అండ్ ది డార్క్ నెస్ మూవీకి రీమేక్ గా తెరకెక్కింది. 

రిక్షావోడు 

Manam News

మెగాస్టార్ చిరంజీవి హీరోగా క్రాంతికుమార్ నిర్మాతగా కోడిరామకృష్ణ  దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ రిక్షావోడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్ గానే నిలిచింది. 

బిగ్ బాస్ 

manam news

శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ పతాకంపై మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మించిన మూవీ బిగ్ బాస్. ఈ చిత్రానికి విజయ బాపినీడు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.  విడుదలకు ముందు భారీ అంచనాలున్న ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. 

SP పరశురాం :

Manam News

మెగాస్టార్ చిరంజీవి-అల్లు అరవింద్ కాంబినేషన్ లో తెరకెక్కిన 11వ సినిమా SP పరశురాం . అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని జీకేరెడ్డి, ముఖేష్ ఉదేషితో కలిసి సంయుక్తంగా నిర్మించారు. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ తమిళంలో సత్యరాజ్ హీరోగా తెరకెక్కిన వాల్డర్ వెట్రివెల్ మూవీకి  ఇది రీమేక్. జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ తరువాత చిరంజీవి-శ్రీదేవి కాంబోలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్ :

Manam News

చిరంజీవి, నిర్మాత కే.ఎస్.రామారావు కలయికలో వచ్చిన 5వ సినిమా స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్. ఈ సినిమాని రచయిత యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా కూడా డిజాస్టర్ గానే నిలిచింది.

రాజావిక్రమార్క :

Manam News

చిరంజీవి, రవిరాజ పినిశెట్టి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం రాజా విక్రమార్క. ఈ సినిమాను తమిళంలో ప్రభు హీరోగా తెరకెక్కిన మై డియర్ మార్తాండం అనే సినిమాకు రీమేక్. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ డీలా పడిపోయింది.

లంకేశ్వరుడు : 

Lankeswarudu :

Advertisement

దర్శకరత్న దాసరి నారాయణరావు-చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ లంకేశ్వరుడు. విజయమాధవి ప్రొడక్షన్స్ పతాకంపై వడ్డె రమేష్ నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంచనాలను తలకిందులు చేసి ఫ్లాప్ గా నిలిచింది.

త్రినేత్రుడు :

Manam News

చిరంజీవి-కోదండరామిరెడ్డి కలయికలో వచ్చిన మూవీ త్రినేత్రుడు. అంజనా ప్రొడక్షన్ పతాకంపై నాగబాబు నిర్మించిన రెండో సినిమా త్రినేత్రుడు. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గానే నిలిచింది.

యుద్ధభూమి :

Manam News

మెగాస్టార్ చిరంజీవి-దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబోలో వచ్చిన 7వ చిత్రం యుద్ధభూమి. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద చేసిన యుద్ధంలో గెలవలేక ఓడిపోయింది.

చక్రవర్తి : 

చిరంజీవి-రవిరాజాపినిశెట్టి కాంబినేషన్ తెరకెక్కిన మరో మూవీ చక్రవర్తి. తమిళంలో శివాజీ గణేషన్ హీరోగా తెరకెక్కిన జ్ఞాన ఓలి చిత్రానికి ఇది రీమేక్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. 

ఆరాధన : 

Aaradhana

మెగాస్టార్ చిరంజీవి-అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కిన చిత్రం ఆరాధన. భారతీరాజా దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ తమిళంలో సత్యరాజ్ హీరోగా తెరకెక్కిన కడలోరా కవితైగల్ సినిమాకి రీమేక్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది.

జేబుదొంగ :

Manam

చిరంజీవి-ఏ.కోదండరామిరెడ్డి కలయికలో వచ్చిన చిత్రం జేబుదొంగ. రోజా మూవీస్ పతాకంపై అర్జున్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ మూవీ కూడా డిజాస్టర్ గా నిలిచింది.

రుద్రనేత్ర : 

Rudranetra ;

కే.రాఘవేంద్రరావు-చిరంజీవి కాంబోలో తెరకెక్కిన 8వ సినిమా రుద్రనేత్ర. ఈ చిత్రంలో చిరంజీవి జేమ్స్ బాండ్ పాత్రలో నటించినప్పటికీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.

కిరాతకుడు : 

చిరంజీవి, ఏ.కోదంరామిరెడ్డి కలయికలో వచ్చిన 13వ సినిమా కిరాతకుడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది.

వేట : 

Manam News

చిరంజీవి, ఏ.కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో వచ్చిన 14 వ చిత్రం వేట. ఈ సినిమా ది కౌంట్ ఆఫ్ మొంటే క్రిస్టో మూవీకి రీమేక్ గా తెరకెక్కింది.

చాణక్యశపథం : 

Manam News

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు-చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కిన 5వ సినిమా చాణక్య శపథం. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.

ధైర్యవంతుడు :

Manam News

చిరంజీవి హీరోగా లక్ష్మీ దీపక్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ధైర్యవంతుడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గానే నిలిచింది.

చిరంజీవి : 

Manam News

మెగాస్టార్ చిరంజీవి తన పేరుతో నటించిన మూవీ చిరంజీవి. సివీ రాజేంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

హీరో :

Manam News

మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ కాంబినేషన్ లో వచ్చిన మరో సినిమా హీరో. ఈ సినిమా హాలీవుడ్ లో హిట్ అయిన ది రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్మ్ మూవీని తెలుగులో మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించారు. విజయబాపినీడు దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది.

శివుడు శివుడు శివుడు : 

Manam news

చిరంజీవి-కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘శివుడు శివుడు శివుడు’  ఈ చిత్రంలో హీరోయిన్ గా రాధిక నటించింది. క్రాంతికుమార్ నిర్మించారు. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం కూడా డిజాస్టర్ గా నిలిచింది. వీటిలో రుద్రవీణ, ఆపద్భాందవుడు వంటి సినిమాలు టాక్ బాగున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఫలితాన్ని దక్కించుకోలేకపోయాయి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

రాజమౌళి తన కెరీర్లో ఇలాంటి అవమానం పొందారా? తన మొదటి సినిమా రిలీజ్ అయ్యాక..?

 అల్లు అర్జున్ చెప్పిన ఆ ఒక్క విషయం వల్లే ఈ సినిమా సూపర్ హిట్ అయ్యిందా? అదేంటంటే?

Visitors Are Also Reading