Home » TDP ప్రభుత్వ పునాదికి 40 ఏళ్లు..NTR తొలి కేబినెట్‌లో మంత్రులు వీళ్లే..!

TDP ప్రభుత్వ పునాదికి 40 ఏళ్లు..NTR తొలి కేబినెట్‌లో మంత్రులు వీళ్లే..!

by Bunty
Ad

అలనాటి ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎన్టీఆర్ హీరోగానే కాకుండా రాజకీయ నాయకుడిగా సక్సెస్‌ అయ్యారు. బీసీలకు అండదండగా నిలిచారు ఎన్టీఆర్. అయితే, తెలుగుదేశం పార్టీ సోమవారం నాటికి 40వ వేట అడుగు పెట్టింది. 1982 మార్చి 29న హైదరాబాదులోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వేదికగా, ప్రజల హర్షద్వానాల మధ్య తన పార్టీ పేరు ‘తెలుగుదేశం’ అని ఎన్టీఆర్ ప్రకటించారు. అయితే పార్టీ ఆవిర్భవించిన 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది.

READ ALSO : ఆస్పత్రి బెడ్‌ పైన ఉన్న పంత్‌ కు BCCI శుభవార్త..రూ.21 కోట్లు ఇవ్వాలని నిర్ణయం!

Advertisement

మూడు దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ లో పాతుకు పోయిన కాంగ్రెస్ ను కూకటివేళ్లతో పేకిలిస్తూ, టిడిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1983 జనవరి 5న జరిగిన ఎన్నికల్లో టిడిపి ఘన విజయం సాధించగా, జనవరి 9న రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ అపూర్వ ఘట్టానికి జనవరి 9వ తేదీకి నాలుగు దశాబ్దాలు పూర్తయ్యాయి.

Advertisement

ఎన్టీఆర్ తొలి కేబినేట్ లో మంత్రులు వీరే,

నందమూరి తారక రామారావు-ముఖ్యమంత్రి, హోం,శాంతిభద్రతలు, పరిపాలన, సమాచారం, భారీ పరిశ్రమలు, ప్రణాళిక మిగిలిన శాఖలు
నాదెండ్ల భాస్కరరావు-ఆర్థిక, వాణిజ్య పన్నులు, ఇంధన
కుందూరు జానారెడ్డి-వ్యవసాయం, సహకార
యనమల రామకృష్ణుడు-న్యాయ, మున్సిపల్ పరిపాలన
జీవన్ రెడ్డి-ఎక్సైజ్
ఎస్.సత్యనారాయణ-రవాణా
కావలి ప్రతిభ భారతి-సాంఘిక సంక్షేమం
మహేంద్ర నాథ్-రెవెన్యూ, పౌరసరాఫరాలు
ఎస్.రామమునిరెడ్డి-వైద్య, ఆరోగ్యశాఖలు
కరణం రామచంద్రరావు-పంచాయతీరాజ్
నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి-ప్రజా పనులు, నీటిపారుదల
మహమ్మద్ షకీర్-పర్యాటకం, వక్ఫ్
ఎం.రామచంద్రరావు-కార్మిక, ఉపాధి
పూసపాటి ఆనంద గజపతిరాజు-విద్య
యీలి ఆంజనేయులు-దేవాదాయ శాఖ

READ ALSO : ‘ఆరుగురు పతివ్రతలు’ సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎక్కడ ఉందో..ఇప్పుడు ఆ పనులు చేస్తుందా ?

Visitors Are Also Reading