సాధారణంగా బాలీవుడ్‌లో విడుదలైన సినిమాలు సౌత్ ఇండియాలో రికార్డు సృష్టిస్తుంటాయి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సౌత్ ఇండియాలో విడుదలైన సినిమాలు బాలీవుడ్‌లో రికార్డు క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా బాహుబలి సినిమా నుంచే ఎక్కువ ఈ ట్రెండ్ కొనసాగుతుందనే చెప్పాలి. బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, కార్తికేయ సహా బాలీవుడ్‌లో ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాలుగా నిలిచిన సినిమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
బాహుబలి 2 :
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా సంచలన విజయమే సాధించిందని చెప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 1810 కోట్లు వసూలు చేస్తే.. భారతీయ బాక్సాఫీస్ వద్ద రెండవ అతిపెద్ద విజయంగా నిలిచింది. బాహుబలి 2 టాప్ లో ఉంది. 2017లో విడుదలైన బాహుబలి 2 అప్పటివరకు ఉన్న భారతీయ సినిమా రికార్డులన్ని తిరగరాసింది. కేవలం హిందీలో కూడా బాహుబలి 2 550 కోట్ల వసూలు చేసి ఇప్పటికీ నెంబర్ వన్ గా నిలిచింది.
కేజీఎఫ్ 2 :
యశ్ మూడేళ్ల కిందటి వరకు కేవలం కన్నడలోనే స్టార్ హీరో. కానీ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా ఎదిగారు. కేజీఎఫ్‌తో రికార్డును బ్రేక్ చేసిన యశ్ కేజీఎప్ 2 తో మళ్లీ పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా దాదాపు 1230 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే కేవలం బాలీవుడ్‌లో మాత్రం 435.2 కోట్ల షేర్ తో రెండవస్థానంలో నిలిచింది.
ఆర్ఆర్ఆర్ :
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్, అజయ్ దేవ్‌గణ్ హీరోలుగా తెరకెక్కిన సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే ఏకంగా రూ.500కోట్లు వసూలు చేసింది. రెండువారాల్లోనే ఈ చిత్రం వెయ్యికోట్ల క్లబ్‌లో చేరింది. ఇక ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. ఓవరాల్‌గా రూ.1150.10 కోట్లు గ్రాస్‌తో టాప్3లో ఉన్న సినిమా కేజీఎఫ్2 కారణంగా టాప్ 4 కి పడిపోయింది. కేవలం హిందీలో ఆర్ఆర్ఆర్ 276.8 కోట్ల షేర్ వసూలు చేసింది.
2.0 :
రజినీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా 2.0 రోబోకు సీక్వెల్‌గా వచ్చిన ఈసినిమా రూ.709 కోట్లు వసూలు చేసింది. భారతదేశంలో కాకుండా ఇతర దేశాల్లో ఈ సినిమా ఎక్కువ వసూలు చేయడం విశేషం. సౌత్ ఇండియాలో ఈ సినిమా దారుణంగా నష్టాల పాలైంది. కేవలం బాలీవుడ్‌లో రూ.189కోట్లు వసూలు చేసింది 2.0.
సాహో :
ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.435 కోట్లు వసూలు చేసింది. ఇక ఈ సినిమా కేవలం హిందీలో 150.6 కోట్లు వసూలు చేసింది. సౌత్ ఇండియాలో సాహో డిజాస్టర్ అనే చెప్పాలి.
బాహుబలి :
Advertisement
ప్రభాస్-రాజమౌళి కాంబినేషన్‌లో 2015లో వచ్చిన బాహుబలి సినిమా అప్పట్లో ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. కేవలం తెలుగులోనే కాదు.. హిందీలో కూడా అద్భుతాలే సృష్టించింది బాహుబలి. ప్రపంచ వ్యాప్తంగా రూ.650 కోట్లకు పైగా వసూలు చేస్తే.. ఇక బాలీవుడ్‌లో మాత్రం రూ.150 కోట్లు వసూలు చేసింది.
పుష్ప :
ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ పుష్ప. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. తెలుగులో సూపర్ హిట్ సాధించింది. దేశవ్యాప్తంగా హిట్ సాధించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కలిపి రూ.360కోట్ల గ్రాస్ వసూలు చేసింది. పుష్ప హిందీలో 108 కోట్లు వసూలు చేయడం విశేషం.
కేజీఎఫ్ :
కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా యశ్ ఐకాన్ స్టార్‌గా మారిపోయారు. బాలీవుడ్ లో కూడా అభిమానులను సంపాదించుకున్నారు. కేజీఎఫ్ సూపర్ హిట్ సాధించింది. బాలీవుడ్‌లో ఈ సినిమా రూ.45కోట్లకు పైగా వసూలు చేసి అప్పట్లో రికార్డునే సృష్టించింది.
ఇది కూడా చదవండి : “రుద్రమదేవి”లో గోన గన్నారెడ్డి పాత్రను మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరో తెలుసా..?
కబాలీ :
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాపై భారతీయ చిత్ర పరిశ్రమ యావత్ ఆసక్తిని కనబరిచింది. ఈ సినిమా విడుదలకు ముందే హైప్ క్రియేట్ చేసి విడుదల తరువాత డిజాస్టర్‌గా మిగిలిందనే చెప్పవచ్చు. అప్పటికే రజినీకాంత్ వరుస ఫ్లాప్ సినిమాలతో కొనసాగుతున్న సమయంలో కబాలీ సినిమా విడుదల అయింది. సినిమా ఎలా ఉన్నప్పటికీ కలెక్షన్ల వర్షం మాత్రం కురిసిందనే చెప్పవచ్చు. కబాలీ మూవీ విడుదలకు ముందే 220 కోట్ల బిజినెస్ చేసింది. విడుదలైన తరువాత ప్రపంచవ్యాప్తంగా 250 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది. కబాలీ బాలీవుడ్‌లో రూ.28కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
ఇది కూడా చదవండి : సుధీర్ పై కన్నేసిన కృతి శెట్టి.. అది బాగా నచ్చిందట..!!
కార్తికేయ 2 :
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటించిన కార్తికేయ 2 భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రూ.100 కోట్ల వసూళ్లు నమోదు చేసిన కార్తికేయ 2 ప్రస్తుతం బాలీవుడ్‌లో భారీ షేర్స్‌ని దక్కించుకుందనే చెప్పాలి. ఈ సినిమా సౌత్ నుంచి బాలీవుడ్‌లో విడుదలై అత్యధిక వసూళ్లు సాధించి టాప్ 10 సినిమాల జాబితాలో చోటు సంపాదించుకుంది. ఈ సినిమా బాలీవుడ్‌లో రూ.25కోట్ల వసూలు సాధించడం విశేషం. ఇప్పటివరకు కేవలం కొన్ని సినిమాలు మాత్రమే బాలీవుడ్‌లో భారీ వసూలు చేశాయి. ముఖ్యంగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన కార్తికేయ2 సంచలన విజయం సాధిస్తుందని ఎవ్వరూ ఊహించలేదని చిత్ర బృందం పేర్కొనడం విశేషం.
ఇది కూడా చదవండి : ఇక హీరో రామ్ ని అలా చూడలేం.. అంతటి సంచలన నిర్ణయం వెనక అసలు కథ ఇదేనా..!!