Home » “రుద్ర‌మ‌దేవి”లో గోన గ‌న్నారెడ్డి పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవ‌రో తెలుసా..?

“రుద్ర‌మ‌దేవి”లో గోన గ‌న్నారెడ్డి పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవ‌రో తెలుసా..?

by AJAY
Ad

స్వీటీ అనుష్క హీరోయిన్ గానే కాకుండా లేడీ ఓరియంటెడ్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన సంగ‌తి తెలిసిందే. అనుష్క న‌టించిన లేడీ ఓరింయెంటెడ్ చిత్రాల‌లో రుద్ర‌మ‌దేవి సినిమా కూడా ఒక‌టి. ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. రాణి రుద్ర‌మ‌దేవి చ‌రిత్ర ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఈ సినిమాకు గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాలో అనుష్క‌తో పాటూ రానా మ‌రియు అల్లు అర్జున్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.

Advertisement

అల్లు అర్జున్ పాత్ర నిడివి సినిమాలో త‌క్కువ‌గానే ఉన్నా కూడా నీ మొల‌తాడులో నా తాయిత్తు….గ‌మ్మునుండ‌వో అంటూ తెలంగాణ యాస‌లో డైలాగులు విసిరాడు. ఆ పాత్ర సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఈ సినిమాను ఇత‌ర భాష‌ల్లో విడుద‌ల చేయ‌గా అక్క‌డ కూడా బ‌న్నీ న‌ట‌న‌కు ఫిదా అయ్యారు.

Advertisement

ఈ పాత్ర‌లో అల్లు అర్జున్ గెటప్ కూడా ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. గ‌డ్డం మీసాల‌తో బ‌న్నీ మాస్ లుక్ లో క‌నిపించాడు. ఇదిలా ఉంటే గుణ‌శేఖ‌ర్ గోన గ‌న్నారెడ్డి పాత్ర కోసం ముందుగా అల్లు అర్జున్ ను అనుకోలేదట‌. మొద‌ట ఈ పాత్ర కోసం ఎన్టీఆర్ ను అనుకున్నార‌ట‌. అంతే కాకుండా క‌థ చెప్ప‌గా ఎన్టీఆర్ కు క‌థ న‌చ్చిన‌ప్ప‌టికీ కూడా సినిమాలో డేట్స్ స‌ర్దుబాటు కాని కార‌ణంగా రిజెక్ట్ చేశారు.

అదే విధంగా గోన‌గ‌న్నారెడ్డి ఈ పాత్ర కోసం మ‌హేశ్ బాబును కూడా సంప్ర‌దించార‌ట‌. కానీ మ‌హేశ్ బాబు ఆ పాత్ర నిడివి త‌క్కువ‌గా ఉంద‌ని అంతే కాకుండా ఆ పాత్ర త‌న‌కు అంత‌గా సూట్ అవ్వ‌ద‌ని చెప్పి రిజెక్ట్ చేశార‌ట‌. ఇక ఫైన‌ల్ గా సినిమాలో అల్లు అర్జున్ ను తీసుకున్నారు. కాగా బ‌న్నీ త‌నదైన స్టైల్ లో న‌టించి ప్ర‌శంస‌లు అందుకున్నారు.

also read : “అమ్మోరు” సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…? ఏం చేస్తుందంటే….?

Visitors Are Also Reading