Home » ఇక హీరో రామ్ ని అలా చూడలేం.. అంతటి సంచలన నిర్ణయం వెనక అసలు కథ ఇదేనా..!!

ఇక హీరో రామ్ ని అలా చూడలేం.. అంతటి సంచలన నిర్ణయం వెనక అసలు కథ ఇదేనా..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం ఇండస్ట్రీలో యంగ్ అండ్ డైనమిక్ హీరోలలో రామ్ కూడా ఒకరు.. ఆయన ఇప్పటికీ ఎన్నో సినిమాల్లో నటించి సూపర్ హిట్ కొట్టాడు.. ఈ క్రమంలోనే తాజాగా ది వారియర్ మూవీ భారీ అంచనాల నడుమ థియేటర్ లోకి వచ్చింది.. కానీ ఈ సినిమా ద్వారా అనుకున్నంత రిజల్ట్స్ రాబట్టలేదు. దీంతో రామ్ కెరీర్ లో మరో ఫ్లాప్ వచ్చి పడింది.. ఈ క్రమంలో హీరో రామ్ ఫ్లాప్ కావడానికి ప్రధాన కారణాలు ఏంటో తెలుసుకొని మార్పులు చేర్పులు చేసుకునే ప్రయత్నంలో పడ్డారట. తన నెక్స్ట్ సినిమా ఎలాగైనా హిట్ కొట్టాలని గట్టి కసరత్తు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది.. అయితే కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో తీసిన ది వారియర్ మూవీ హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు..

Advertisement

also read:

Advertisement

కానీ అందరి అంచనాలు తలకిందులు సినిమా భారీగా ఫెయిల్ అయిపోయింది.. దీంతో రాంపై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం తగ్గించేశారు అభిమానులు. దీనికి కారణం సినిమా కథ పాత గా ఉండటం.. రాము అంతకు ముందు సినిమాల్లో ఏ విధంగా అయితే చూపించారో అదే లుక్ లో చూడడం అభిమానులకు బోర్ కొట్టేసింది.. అందుకే సినిమా ఫెయిల్ అయిందని సినీ విశ్లేషకులు అంచనా వేశారు. ఈ క్రమంలో రామ్ తన నెక్స్ట్ మూవీ బోయపాటితో చేయనున్నట్లు తెలుస్తోంది.. అయితే ఈ సినిమా కోసం హీరో దాదాపు 15 కిలోల బరువు పెరగడం కోసం కసరత్తు మొదలు పెట్టారని సినీ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి..

ఎందుకంటే ఈ మూవీలో రామ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు. దీని కోసం హీరో రామ్ ఏకంగా 15 కేజీల బరువు పెరగడం కోసం సిద్ద పడ్డారట. దీంతో సన్నగా ఉన్న రామ్ బొద్దుగా కనిపించాలని బోయపాటి చెప్పడంతో ఈ మూవీ కోసం ఏమైనా చేస్తానని ఓకే చెప్పారట .. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో చాలామంది అభిమానులు రామ్ కెరీర్లో ఈ మూవీ బెస్ట్ మూవీగా నిలిచిపోతుందని అంటున్నారు.. మరి చూడాలి ఈ సినిమాతో అయినా రా మళ్లీ కం బ్యాక్ అవుతారో లేదో..

also read:

Visitors Are Also Reading