Home » తండ్రికి తగ్గ తనయులు అనిపిస్తున్న టాలీవుడ్ దర్శకుల కూతురు వీరే..!

తండ్రికి తగ్గ తనయులు అనిపిస్తున్న టాలీవుడ్ దర్శకుల కూతురు వీరే..!

by Anji

సాధారణంగా పిల్లలకు తమ తల్లిదండ్రుల లక్షణాల్లో ఎవరివో ఒకరివి వస్తుండటం సహజం. వారి తెలివి, వారి చేష్టలు, వారి పోలికలు ఇలా చాలా వరకు తండ్రివో, తల్లివో లక్షణాలు కనిపిస్తుంటాయి. అలాగే మన టాలీవుడ్ కి చెందిన కొందరూ డైరెక్టర్ల కూతుర్లు కూడా వంద శాతం రుజువు అని నిరూపిస్తున్నారు. దర్శకుల పుత్రిక రత్నాలు కూడా పలు రంగాల్లో దూసుకుపోతున్నారు. వారు ఎవరెవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సుకుమార్ – సుకృత : 

టాలీవుడ్ టాలెంటేడ్ దర్శకుల్లో సుకుమార్ ఒకరు. ఈయన కూతురు సుకృత కూడా చిన్న వయస్సులోనే తాను టాలెంటేడ్ డైరెక్టర్ కడుపున పుట్టిన జీనియస్ అని నిరూపిస్తుంది. స్వతహగా అయిన సుకృత తన తండ్రి పుట్టిన రోజు కానుకగా స్వయంగా ఓ పాట పాడి స్పెషల్ గిప్ట్ గా ఇచ్చింది. సుకృత అర్భన్ జామ్ విత్ అనే యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసింది. సుకృత మంచి సింగర్ లేదా  తండ్రి మాదిరిగానే డైరెక్టర్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. 

పూరిజగన్నాధ్-పవిత్ర : 

మాస్, డైనమిక్ అండ్ డేరింగ్ దర్శకుడు పూరి జగన్నాధ్ కూతురు పవిత్ర లేడీ దర్శకుడు అవ్వాలనే ప్రణాళికలో ఉన్నారట. ఇప్పటికే ఈ శాఖలో నైపుణ్యం సంపాదించే పనిలో ఉన్నారట. దర్శకత్వ కోర్సులు అభ్యసించడంతో పాటు తన తండ్రి పూరి దగ్గర మెళుకువలు నేర్చుకుంటుందట. పవిత్ర పూరి చైల్డ్ ఆర్టిస్టుగా పూరి దర్శకత్వం వహించిన కొన్ని సినిమాల్లో కనిపించారు. లేడీ డైనమిక్ డైరెక్టర్ గా పవిత్ర పూరి ఎదగడం ఖాయమనిపిస్తోంది. సోషల్ మీడియాలో సైతం సూపర్ ఫాలోయింగ్ తో ఈ అమ్ముడు దూసుకుపోతుంది.

రాజమౌళి – మయూఖ : 

దర్శక ధీరుడు రాజమౌళి ఫ్యామిలీ అంటే.. అది ఓ సాంకేతిక నిపుణుల నిలయం అనాలి. ఆ ఫ్యామిలీలో అనేక క్రాప్ట్స్ కి చెందిన ఆర్టిస్ట్ ఉన్నారు. రాజమౌళి కూతురు మయూఖ బాహుబలి సినిమాలో కొన్ని సన్నివేశాల్లో తళుక్కున మెరిసింది. 24 క్రాప్ట్స్ లో ఏదో ఒక విభాగంలో మయూఖ ముందుకెళ్లనుందట.

తేజ-ఐలా :

 

ప్రేమ కథా చిత్రానికి పెట్టింది మారుపేరు దర్శకుడు తేజ. తన కొడుకు అమితోవ్ ని కూడా హీరోగా పరిచయం చేసే పనిలో ఉన్నాడు. తేజ కూతురు ఐలా అమెరికాలో బిజినెస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ మాస్టర్స్ చేస్తుంది. ఐలా మంచి స్పీకర్ కాగా.. అక్కడ బెర్కోలి ఫోరమ్ తరపున వ్యాఖ్యాతగా ఉపన్యాసాలు ఇస్తున్నారట. యువత తమ ఆలోచనలను బిజినెస్ వైపుగా మళ్లించి జీవితంలో ఎదగాలని స్పూర్తి నింపుతున్నారట.

గుణశేఖర్-నిలిమ, యుక్త : 

భారీ సినిమాల దర్శకుడు గుణశేఖర్ రానాతో హిరన్య కశిప మూవీ చేయనుండగా దాని ప్రీ ప్రొడక్షన్ పనులను చూసుకుంటున్నారు. ఈయన ఇద్దరూ కూతుర్లు కూడా సినీ రంగంలో రాణించాలని ప్రణాళికలను వేస్తున్నారు. పెద్ద కూతురు నీలిమ రుద్రమదేవి ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. చిన్న కూతురు యుక్త సినిమా మేకింగ్ కి సంబంధించిన ఏదో ఒక విభాగంలో సెటిల్ కావాలనుకున్నారట.

వంశీ పైడిపల్లి-ఆద్య : 

దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు ఆద్య చిన్న వయస్సులోనే మంచి స్పీకర్ అని నిరూపించుకున్నారు. ఆద్య మహేష్ కూతురు సితారతో కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. ఈ చిచ్చర పిడుగులు ఏకంగా మహేష్ ని తమ ఛానెల్ ద్వారా ఇంటర్వ్యూ చేసారు. వినాయకుడు వంటి సోషల్ అవెర్ నెస్ కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. ఆద్య సైతం భవిష్యత్ లో సినీ రంగంలో రాణించడం ఖాయం.

మారుతి-అభీష్ట : 

ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు మారుతి కూతురు అభిష్ట లేటెస్ట్ సూపర్ హిట్ ప్రతిరోజూ పండుగే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. ముందు ముందు కూడా  సినిమాల్లో నటించే అవకాశం కనిపిస్తోంది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading