సాధారణంగా సినీ ఇండస్ట్రీని ఓ మాయాలోకంతో పోల్చుతుంటారు. ఎందుకంటే వెండి తెరపై ఓ వెలుగు వెలిగిన నటీనటులు ఒక్కసారిగా కనిపించకుండా కనుమరుగు అవుతాయి. సాధారణంగా ప్రజలు నటీ, నటులను తమకు నచ్చినప్పుడు అభిమానిస్తారు. నచ్చనప్పుడు పక్కన పడేస్తుంటారు. ఇలాంటి వాటికి బాధితులు అయిన వారు చాలా మంది ఉన్నారు. అదేవిధంగా సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగి ప్రజల్లో అభిమానాన్ని కలిగి ఉండి కూడా ఎవ్వరికీ తెలియకుండానే కనుమరుగు అయినా వారు కూడా ఉన్నారు. టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగి కనిపించకుండా పోయిన 5గురు స్టార్ హీరోల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Also Read : Mahesh babu: అలా ఉంటేనే పెళ్లి చేసుకుంటా అని భర్తకి కండిషన్ పెట్టిన నమ్రత..!!
తరుణ్
ఒకప్పుడు అమ్మాయిలకు ఫేవరేట్ హీరోగా నిలిచిన డ్రీమ్ బాయ్ తరుణ్. ప్రస్తుతం ఏ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించడం లేదు. బాలనటుడుగా సినీ రంగ ప్రవేశం చేశారు. తరుణ్ హీరోగా నువ్వె కావాలి సినిమా ద్వారా పరిచయమయ్యారు. 2014లో వేట అనే సినిమా చేసి నాలుగేళ్ల గ్యాప్ తీసుకున్నారు. మళ్లీ 2018లో ఇది నా లవ్ స్టోరీ అనే సినిమాలో నటించారు. ప్రస్తుతం మాత్రం తరుణ్ ఏ సినిమాలో నటించడం లేదు.
వేణు తొట్టెంపూడి
ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగారు. హీరో వేణు. 1999లో స్వయంవరం సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ సాధించాడు. ఇక ఆ తరువాత చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్, పెళ్ళాం ఊరెళ్లితే, చెప్పవే చిరుగాలి, ఖుషి కుషిగా వంటి హిట్ చిత్రాల్లో నటించి ప్రజలకు చేరువయ్యాడు. ఈ మధ్యకాలంలో సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చారు. ఇటీవల రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా ద్వారా కనిపించాడు. మరల ఏ సినిమాలో కనిపించకపోవడం విశేషం.
Advertisement
Also Read : brahmanandam: ఇండస్ట్రీలో అలాంటి తేడాలు ఉండవు.. ఏదైనా ఒకటే బ్రహ్మానందం కామెంట్స్ వైరల్..!!
వడ్డె నవీన్
ప్రముఖ ఫిలిం ప్రొడ్యూసర్ వడ్డె రమేష్ కుమారుడు వడ్డె నవీన్. పెళ్లి, ప్రియా ఓ ప్రియా, లవ్ స్టోరీ చాలా బాగుంది వంటి సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు. చివరగా అతను రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఎటాక్ చిత్రంలో గోపి అనే పాత్రలో కనిపించారు. ఉన్నట్టుండి అకస్మాత్తుగా సినీ పరిశ్రమకు దూరమయ్యాడు వడ్డె నవీన్.
తారకరత్న
ఒకటో నెంబర్ కుర్రాడు, యువరత్న, తారక్, భద్రాద్రి రాముడు వంటి ఎన్నో చిత్రాల్లో వరుసగా, నటించి ప్రేక్షకాదరణ పొందలేని ఏకైక నందమూరి వారసుడిగా మిగిలిపోయాడు. 2009లో విడుదలైన అమరావతి సినిమాలో విలన్ గా నటించాడు. ఇందులో నంది అవార్డు కూడా లభించింది. ప్రేక్షకులు అతనిలో హీరో మెటీరియల్ చూడలేకపోయారు. దీంతో వెండితెరకు పూర్తిగా దూరమయ్యాడు.
ఆర్యన్ రాజేష్
ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ పెద్ద కుమారుడు ఆర్యన్ రాజేష్. హాయ్ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఇక ఆ తరువాత ఎవడిగోల వాడిదే, ఆడంతే అదోటైపు, నువ్వంటే నాకిష్టం, అనుమానాస్పదం సినిమాలో నటించాడు. ఆ తరువాత సైడ్ క్యారెక్టర్లకే పరిమితమయ్యాడు ఆర్యన్ రాజేష్.