Home » మెగాస్టార్ చిరంజీవి:1990 లో చిరంజీవి నటించిన ఈ 3 సినిమాలు బాక్సాఫీస్ ను రఫ్ఫాడించేశాయి ..!

మెగాస్టార్ చిరంజీవి:1990 లో చిరంజీవి నటించిన ఈ 3 సినిమాలు బాక్సాఫీస్ ను రఫ్ఫాడించేశాయి ..!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వారు ఉండరు. ఆనాటి కాలంలో ఆయన సినిమా థియేటర్ లోకి వచ్చిందంటే విజయ దుందుభి మోగేది. అంతటి క్రేజ్ ఉన్న హీరో చిరంజీవి. మరో ముఖ్య విషయం ఏంటంటే ఒకే సంవత్సరంలో 3 సినిమాలు రిలీజ్ అయి బాక్సాఫీస్ ను బద్దలు కొట్టాయి. అవేంటో ఒకసారి చూద్దాం..?1990లో కొండవీటి దొంగ, కొదమసింహం, జగదేకవీరుడు అతిలోకసుందరి వంటి సినిమాలు రిలీజ్ అయి బాక్సాఫీస్ ను షేక్ చేసాయి.కొండవీటి దొంగ: 1990లో కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ భారీ హిట్ కొట్టింది. ఇందులో చిరంజీవి సరసన విజయశాంతి,రాధా ప్రధాన పాత్రలను పోషించారు. ఈ మూవీని విజయలక్ష్మి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ కథ అందించడం, యండమూరి చిత్రానువాదం సమకూర్చారు. కొండవీడు అనే గిరిజన ప్రాంతంలో చిరంజీవిని గూడెం నాయకుడు కాపాడతాడు. ఈ సమయంలో చిరంజీవి కొండవీటి దొంగ అవతారమెత్తమని సలహా ఇస్తాడు. ఈ విధంగా ఆయన కొండవీటి దొంగ వేషంలో ధనవంతులు దగ్గర సొమ్ము దోచి పేదలకు పంచి పెడుతూ ఉంటాడు.కొదమసింహం : 1990లో కైకాల నాగేశ్వరరావు ఈ సినిమాను నిర్మించగా, మురళీమోహన్ దర్శకత్వం వహించారు. ఇందులో వాణి విశ్వనాథ్ రాధాతో పాటుగా ప్రాణం అనే హిందీ నటి కూడా నటించింది. ఇందులో మోహన్ బాబు, కైకాల సత్యనారాయణ, కన్నడ ప్రభాకర్, గొల్లపూడి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలో గుర్రపు స్వారీ కోసం చిరంజీవి ఆసమయంలో రాజస్థాన్లో గుర్రపు స్వారీ కూడా నేర్చుకున్నారు. ఈ మూవీలో పాటలు కూడా చాలా హిట్టయ్యాయి. రాజ్ కోటి సంగీతాన్ని అందించారు. 1990 ఆగష్టు 9న మూవీ మొదలై బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టింది.జగదేకవీరుడు అతిలోకసుందరి :1990లో చిరంజీవి హీరోగా కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన మూవీ ఇది. ఈ సినిమాను వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మించారు. జంధ్యాల రాఘవేంద్రరావు కలిపి స్క్రీన్ ప్లే రాశారు. ఇందులో శ్రీదేవి ప్రధాన పాత్రలో అమ్రిష్ పురి, అల్లు రామలింగయ్య, కన్నడ ప్రభాకర్, రామిరెడ్డి సహాయ పాత్రల్లో నటించారు. ఇళయరాజా దీనికి సంగీతం సమకూర్చారు . ఇందులో స్వర్గలోకంలో ఇంద్రుని పుత్రికగా శ్రీదేవి భూలోకాన ఉన్నా మనకు సరోవరాన్ని చూడడానికి తండ్రి అనుమతి తీసుకొని అక్కడికి వస్తుంది. తిరిగి వెళ్ళే సమయంలో తన ఉంగరాన్ని పోగొట్టుకుంటుంది. తర్వాత ఏం జరుగుతుంది అనేది సినిమా కథ.

Advertisement

Advertisement

ALSO READ;

F3 ప్రదీప్:అచ్యుత్ మరణానికి కారణం ఇదేనా.. ఆ రోజు హాస్పిటల్ లో ఏం జరిగిందో తెలుసా..?

అన్నమయ్య చిత్రంలో వెంకటేశ్వర స్వామి పాత్ర వద్దనుకున్న స్టార్ హీరోలు ఎవరో తెలుసా..?

 

Visitors Are Also Reading