Home » పవన్ సినిమాల్లో నటించి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్లు !

పవన్ సినిమాల్లో నటించి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్లు !

by Bunty

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంతటి క్రేజ్ ఉంటుందో అందరికీ తెలుసు. ఆయన సినిమా నుంచి మొదలు రాజకీయం వరకు చాలా డిఫరెంట్ థింకింగ్ తో ముందుకు వెళుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ లాగే ఆయన ఫ్యాన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా ఇవాళ, పవన్ సినిమాల్లో నటించి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్ల గురించి తెలుసుకుందాం.

read also : విడాకుల కోసం భార్యని టార్చర్ పెడుతున్న స్టార్ హీరో ..?

# దేవయాని:

1998 లో భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ సుస్వాగతం. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తో నటించిన దేవయాని ఆ తర్వాత రెండు, మూడు సినిమాలకే పరిమితమైంది.

# ప్రీతి జింగానియా:

సూపర్ హిట్ సినిమా తమ్ముడు లో పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన ప్రీతి జింగానియా ఆ తర్వాత నరసింహనాయుడు, అధిపతి వంటి చిత్రాలలో నటించి ప్యాకప్ చెప్పేసింది.

# సుప్రియ యార్లగడ్డ:

పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఈ చిత్రంలో ఈమె హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం తర్వాత అడ్రస్ లేకుండా పోయిన సుప్రియ గూఢచారి మూవీలో కీలక పాత్ర పోషించింది.

# కీర్తి రెడ్డి:

హీరో సుమంత్ మాజీ భార్య కీర్తి రెడ్డి. తొలిప్రేమ చిత్రంలో పవన్ కళ్యాణ్ కి జోడిగా నటించిన ఈమె అర్జున్ సినిమాలో మహేష్ బాబు అక్క పాత్రలో నటించింది. ఆ తర్వాత ఏ తెలుగు సినిమాలోను నటించలేదు.

# అదితి గోవిత్రికర్:

తమ్ముడు చిత్రంలో లవ్లీగా బాగా ఫేమస్ అయిన అదితి ఆ తర్వాత ఏ సినిమాలోను ఆమె నటించలేదు.

# రేణు దేశాయ్:

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ బద్రి, జానీ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత ఏ సినిమాలోను నటించలేదు.

# నేహా ఒబెరాయ్:

బాలు సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడిగా నటించిన నేహా ఒబెరాయ్ ఆ తర్వాత జగపతిబాబుతో ఓ సినిమాలో నటించింది. ఇక ఆమె కూడా ప్యాకప్ చెప్పేసింది.

# మీరా చోప్రా:

పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన బంగారం సినిమాలో నటించిన మీరా చోప్రా ఆ తర్వాత రెండు, మూడు సినిమాలకే పరిమితం అయింది.

# నికిషా పటేల్:

కొమరం పులి చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నికిషా పటేల్ ఆ తర్వాత కళ్యాణ్ రామ్ తో “ఓమ్ 3d” లో నటించింది. ఆ తర్వాత ఈమె కూడా ప్యాకప్ చెప్పేసింది.

# సారాజెన్ డియాస్:

పవన్ కళ్యాణ్ పంజా చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సారా ఆ తర్వాత మళ్లీ కనపడలేదు.

read also : హీరో అబ్బాస్ భార్య ఎంత పెద్ద హీరోయినో తెలుసా…చూస్తే ఫిదా అవ్వాల్సిందే !

Visitors Are Also Reading