Ad
దేవుళ్లకు సంబంధించి చిన్న చిన్న విషయాల్లో చాలా సందేహాలుంటాయి. ముఖ్యంగా దేవుడి గదిలో, ఇంట్లో, దిష్టికోసం పెట్టే ఫోటోలు, విగ్రహాలకు సంబంధించి ఇలా ఎన్నో డౌట్స్ ఉంటాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
- సూర్య భగవానుడికి సంబంధించిన ఫోటోను ఇంట్లో అసలు పెట్టకూడదు. ఎందుకంటే సూర్యుడు ప్రత్యక్షంగా కనిపిస్తాడు. మనం నేరుగా నమస్కరించాలి.
- పూజ గది విడిగా లేనట్లయితే పంచముఖ ఆంజనేయుడి ఫోటోను ఇంట్లో అసలు పెట్టకూడదు.
- ఉగ్రరూపంలో ఉన్న నరసింహాస్వామి ఫోటో, విగ్రహం ఇంట్లో ఉంచకూడదు. లక్ష్మినరసింహ, యోగగనరసింహ, ప్రహ్లాద అనుగ్రహ నరసింహస్వామి ఫోటో పెట్టుకుని పూజ చేయొచ్చు.
- చేతిలో పిల్లన గ్రోవి ఉన్న కృష్ణుడు విగ్రహం ఇంట్లో ఉండకూడదు. కృష్ణుడి విగ్రహం ఆవుతో ఉన్న ఫోటో కానీ, చిన్న పరిమాణంలో ఉన్న విగ్రహం కానీ ఇంట్లో ఉండవచ్చు.
- లక్ష్మిదేవి విగ్రహం ముందు లేదా ఫోటో ముందు కానీ ఓ చిన్న గిన్నెలో బియ్యం, అందులో కొన్ని గవ్వలు వేసి ఉంచడం ఉంచడం మంచిది.
- కాళికదేవి, ప్రత్యంగిరా దేవి ఫోటోలు అస్సలు ఇంట్లో పెట్టుకోవద్దని పురాణాలు పేర్కొంటున్నాయి.
- ఇంట్లో విగ్రహాలు ఏర్పాటు చేసే వారు చిన్న సైజులో ఉండే విధంగా చూసుకోవాలి. పెద్దగా ఉంటే మహానివేదన తప్పనిసరి. అభిషేకం, పూజలేకుండా ఉండవద్దు.
- ఇంట్లో నట రాజస్వామి విగ్రహానికి పెట్టుకోకూడదు. నాట్యం నేర్పే ప్రదేశంలో నిత్యం నాట్య నివేదన జరుగుతుంది. అక్కడ ఉండడంతో తప్పులేదు.
Advertisement
- ఇంటి గుమ్మానికి దిష్టి కోసం రాక్షసుల ఫోటోలు పెట్టవద్దు. ఇలాంటి ఫోటోలు పెడితే ఇంటి యజయానికి తరచూ అనారోగ్యానికి గురవుతారు. వినాయకుడి ఫోటో లేదా దిష్టి యంత్రం ఫోటో పెట్టాలి.
- నిత్యం పూజలో ఉన్న విగ్రహాలు పూజ గది నుంచి తీసి వేయాలనుకుంటే గుడిలో పెట్టడం మంచిది.
- ఇంట్లో పూజించే వినాయకుడి విగ్రహంలో తొండం ఎడమవైపున ఉండాలి. విద్యాలయాలు, ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ లో ఉండే విగ్రహానికి తొండం కుడివైపున ఉండాలి. వ్యాపారం చేసే ప్రాంతంలో నిలుచున్న వినాయకుడు ఉంటే మంచిది.
- ఇంట్లో ఉంటే ఫోటోలలో లక్ష్మీదేవి నిల్చుని ఉన్నట్టు అసలు ఉండకూడదు. లక్ష్మీదేవి పచ్చరంగు చీరతో అటూఇటూ ఏనుగులున్న ఫోటోకు గృహస్తులు పూజించడం మంచిది.
- పూజ తరువాత దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం పూజ అయినా వెంటనే తీసేసి ప్రసాదంగా స్వీకరించడం మంచిది. మీరు చేసిన పూజకు ఆ దేవుడు అనుగ్రహాన్ని ప్రసాదం రూపంలో స్వీకరించారని అర్థం.
- పూజ గదిలో ఎంత ఖరీదు అయినా విగ్రహాలు ఉంచినా.. పూజ గదిలో గోడకు పసుపు రాసి పసుపు మధ్యలో గౌరీ కుంకుమ పెట్టడం మరిచిపోవద్దు.
Also Read :
Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ శుభవార్త వింటారు
Astrology : ఏయే రాశుల వారు ఎలాంటి ప్రేమికులను కోరుకుంటారో మీకు తెలుసా..?