Telugu News » Blog » Astrology : ఏయే రాశుల వారు ఎలాంటి ప్రేమికుల‌ను కోరుకుంటారో మీకు తెలుసా..?

Astrology : ఏయే రాశుల వారు ఎలాంటి ప్రేమికుల‌ను కోరుకుంటారో మీకు తెలుసా..?

by Anji
Ads

చాలా మంది పెళ్లికి ముందు చాలా క‌ల‌లు కంటూ ఉంటారు. ఒక్కొక్క‌రి ఆలోచ‌న‌లు ఒక్కోవిదంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రేమ‌, పెళ్లి విష‌యంలో ఎవ‌రి అభిప్రాయం వారిదే. త‌మ‌కు అలాంటి వ్య‌క్తి రావాల‌ని.. ఇలాంటి వ్య‌క్తి కావాల‌ని ఊహించుకుంటారు. ఇక జ్యోతిష్య శాస్త్ర ప్ర‌కారం.. ఏయే రాశుల వారు ఎలాంటి ప్రేమికులు త‌మ జీవితంలోకి రావాల‌ని కోరుకుంటారో ఓ సారి తెలుసుకుందాం.

Advertisement

 మేషం :

ఈ రాశి వారు పెద్ద‌గా క‌ష్ట‌ప‌డ‌కుండానే, పెద్ద‌గా ఎఫ‌ర్ట్ పెట్ట‌కుండానే త‌మ‌ను అర్థం చేసుకునే వ్య‌క్తి త‌మ జీవితంలోకి రావాల‌ని కోరుకుంటారు. అలాంటి వారు త‌మ జీవితంలోకి వ‌స్తే ఆనందంగా ఉంటుంద‌ని వారు న‌మ్ముతుంటారు.

వృషభం :

ఈ రాశివారు త‌మ జీవితంలోకి వ‌చ్చే వ్య‌క్తి లైప్ లాంగ్ ఉండాల‌ని అనుకుంటార‌ట‌. కొద్దికాలం మాత్ర‌మే వ‌చ్చి వెళ్లిపోయే వ్యక్తి త‌మ‌కు వ‌ద్దు అని అనుకుంటారు.

 మిథునం :

ఈ రాశి వారు త‌మ రిలేష‌న్‌షిప్ సాదాసీదాగా సాగ‌డం అస్స‌లు న‌చ్చ‌దు. కాస్త డ్రామా.. మ‌రికొంత స్పైసీ, ఉత్సాహం అన్ని ఉండాల‌ని అనుకుంటారు. వాట‌న్నింటిని అందించే వ్య‌క్తి త‌మ జీవితంలోకి రావాల‌ని కోరుకుంటారు.

కర్కాటకం :

కర్కాటక రాశి స్వభావం కర్కాటక రాశి

ఈ రాశి వారు ఎమోష‌న్స్‌కు చాలా ఎక్కువ విలువ‌నిస్తారు. త‌మ జీవితంలోకి వ‌చ్చే వ్య‌క్తి త‌మ‌కు నిజ‌మైన ప్రేమ‌, ఎఫెక్ష‌న్‌, బ‌హుమ‌తులు ఇచ్చే వ్య‌క్తి జీవిత భాగ‌స్వామి రావాల‌ని కోరుకుంటారు.

 సింహం :

ఈ రాశి వారు త‌మ‌ను నిజంగా ప్రేమించే వ్య‌క్తి. త‌మ‌ను ఆరాదించే వ్య‌క్తి త‌మ జీవితంలోకి రావాల‌ని కోరుకుంటారు. అలాంటి వారు వ‌స్తే.. వారు అమితంగా ప్రేమిస్తారు.

 కన్య :

Advertisement

ఈ రాశి వారు త‌మ జీవితంలోకి వ‌చ్చే వ్య‌క్తి చాలా తెలివిగ‌ల వారు, ల‌క్ష్యంపై ఎక్కువ దృష్టి పెట్టేవారు రావాల‌ని కోరుకుంటారు. ఈ ల‌క్ష‌ణాలున్న వారిని వీరు ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతుంటారు.

తుల :

ఎవ‌రు అయితే త‌మ జీవితానికి ల‌గ్జ‌రీ లైఫ్‌, స‌హ‌జ‌త్వానికి ఒకేలాంటి విలువ ఇస్తూ అచ్చం త‌మ‌లాంటి ఆలోచ‌న‌లున్న వ్య‌క్తి వ‌స్తే బాగుంటుంద‌ని వీరు కోరుకుంటారు.

వృశ్చికం :

ఈ రాశి వారికి త‌మ జీవితంలోకి వ‌చ్చే వ్య‌క్తిపై అంచ‌నాలు చాలా ఎక్కువ. త‌మ అంచ‌నాల‌ను అందుకోగ‌లిగిన వ్య‌క్తి ఎదురైన‌ప్పుడు ఈ రాశివారు ఆటోమెటిక్ గా క‌నెక్ట్ అయిపోతారు.

 ధనస్సు :

ఈ రాశి వారు త‌మ జీవితంలోకి వ‌చ్చే వ్య‌క్తితో తొలుత స్నేహం చేయాల‌నుకుంటారు. ఆ త‌రువాత వారితో బాండింగ్ బాగా కుదిరితే అప్పుడే ప్రేమించాల‌ని అనుకుంటార‌ట‌.

 మ‌క‌రం :

 

ఈ రాశి వారు త‌మ జీవితంలోకి వ‌చ్చే వ్య‌క్తి త‌మ‌ను ఆరాధించే వారు అయి ఉండాల‌ని అనుకుంటారు. త‌మ‌ను అమితంగా ఆరాధించే వారికి మాత్ర‌మే వీరు త‌మ జీవితంలోకి చోటు ఇస్తారు.

 కుంభం :

ఈ రాశి వారు త‌మ లైఫ్‌ని చాలా ఉత్సాహంగా చేసే వారు త‌మ జీవితాన్ని చాలా క్రియ‌టివిటిగా మార్చేవారు రావాల‌నుకుంటారు. అలాంటి వారిని ఎక్కువ‌గా వీరు ప్రేమిస్తారు.

మీనం :

Advertisement

ఈ రాశి వారు త‌మ‌పై అటెన్ష‌న్ ప్రేమ ఎక్కువ‌గా చూపించే వ్య‌క్తి త‌మ జీవితంలోకి రావాల‌ని కోరుకుంటారు. కేవ‌లం త‌మ‌ను మాత్ర‌మే ప్రేమించాల‌ని అనుకుంటారు.