Home » జ‌బ‌ర్ద‌స్త్ షోకి అన‌సూయ స్థానంలో ఆ యాంక‌ర్‌కి ఛాన్స్‌..!

జ‌బ‌ర్ద‌స్త్ షోకి అన‌సూయ స్థానంలో ఆ యాంక‌ర్‌కి ఛాన్స్‌..!

by Anji
Ad

ఈటీవీలో ప్రసారం అయ్యే జ‌బ‌ర్ద‌స్త్ షో గురించి అంద‌రికీ తెలిసిందే. అయితే ఆ షోకు ఫేమస్ అయిన అందాల అన‌సూయ ఇటీవ‌లే గుడ్ బై చెప్పిన విష‌యం విధిత‌మే. బుల్లితెర‌పై ఎంతో మంది క‌మెడియ‌న్స్ ఉన్న‌ప్ప‌టికీ అన‌సూయ క్రేజ్ ప్ర‌త్యేక‌మ‌నే చెప్పాలి. తొలుత న్యూస్ ఛాన‌ల్‌లో ప‌ని చేసిన అన‌సూయ జ‌బ‌ర్ద‌స్త్ ద్వారా త‌న గ్లామ‌ర్ తో ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. అతి త‌క్కువ కాలంలో ఆమె పాపులారిటీ సంపాదించుకుని ఇప్పుడు జ‌బ‌ర్ద‌స్త్ నుంచి క‌నిపించ‌కుండా పోతే ప‌రిస్థితి ఏమిట‌ని ప‌లువురు చ‌ర్చించుకున్నారు.

Advertisement

ఇప్ప‌టికే జ‌డ్జీలు, ప్ర‌ముఖ క‌మెడీయ‌న్లు జ‌బర్ద‌స్త్ నుంచి వెళ్లిపోవ‌డంతో రేటింగ్స్ మ‌రీ దారుణంగా ప‌డిపోయాయి. అన‌సూయ కూడా వెళ్లిపోతే ప‌రిస్థితి ఏమిట‌ని చాలా మంది చ‌ర్చించుకోవ‌డం విశేషం. యాంక‌ర్ అన‌సూయ వెళ్లిపోతే ఆమె స్థానాన్ని భ‌ర్తీ చేయ‌డమంటే చాలా క‌ష్ట‌మ‌నే చెప్పాలి. రెండు జ‌బ‌ర్ద‌స్త్ షోలు కొన‌సాగుతున్నాయి. ఒక‌వైపు ర‌ష్మీ బాగానే ఆక‌ట్టుకుంటున్న ఇప్పుడు అన‌సూయ వెళ్లిపోతే జ‌బ‌ర్ద‌స్త్ షో కోసం మ‌ళ్లీ కొత్త యాంక‌ర్‌గా ఎవ‌రు వ‌స్తార‌నేది ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారిపోయింది. ప్ర‌స్తుతం వినిపిస్తున్న టాక్ వాస్త‌వ‌మైతే మంజూష రాంప‌ల్లి తొలి ఆప్ష‌న్‌గా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఆమె ఇటీవ‌లే గ్లామర్ షో తో ఆకట్టుకుంది. ఇక సోష‌ల్ మీడియాలో కూడా క్రేజ్ సంపాదించింది.

Advertisement

ఇక ఆమె కూడా ఎంపిక అయితే మాత్రం రెమ్యూన‌రేష‌న్ అన‌సూయ కంటే త‌క్కువ ఇచ్చే అవ‌కాశ‌ముంది. ఎపిసోడ్ కి అన‌సూయ ల‌క్ష రూపాయ‌లు తీసుకోగా మంజూష‌కి రూ.50వేల వ‌ర‌కు ఇవ్వ‌నున్న‌ట్టు స‌మాచారం. యాంక‌ర్ అన‌సూయ జ‌బ‌ర్ద‌స్త్ ద్వారా చాలా మంచి గుర్తింపు సంపాదించింద‌నే చెప్ప‌వ‌చ్చు. ఆ త‌రువాత సినిమాల్లో ఎన్ని ఆఫ‌ర్లు వ‌చ్చిన‌ప్ప‌టికి ఆమె జ‌బ‌ర్ద‌స్త్ మాత్రం వ‌ద‌ల‌లేదు. నాగ‌బాబు రోజాతో పాటు ఆమె అలాగే కొన‌సాగుతూ వ‌చ్చారు. దాదాపు ఆమె ఒక వారంలో ప్రసార‌మ‌య్యే ఒక ఎపిసోడ్ కోసంల‌క్ష రూపాయ‌ల‌కు పైగా రెమ్యూన‌రేష‌న్ అందుకున్న‌ట్టు స‌మాచారం.

Also Read : 

Sr.NTR కొడుకు మీద ప్రేమతో కట్టించిన థియేటర్ నేడు ఎలాంటి స్థితిలో ఉందంటే..!

ఈ సీజ‌న్‌లో చింత చిగురు తింటే ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో మీకు తెలుసా..?

Visitors Are Also Reading