టాలీవుడ్ ఇండస్ట్రీకి అల్లు అర్జున్ హీరోగా నటించిన దేశముదురు సినిమాతో పరిచయం అయింది హన్సిక. ఈ చిత్రానికి పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించాడు. అయితే హన్సికది ముంబయి అయినప్పటికీ ఈమె హీరోయిన్ గా దక్షిణాదిలోనే సెటిల్ అయింది. ఈమె త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నారు. డిసెంబర్ 4న పెళ్లి జరుగనుంది.
Advertisement
ముంబై వ్యాపారవేత్త సొహైల్ కతురియాను ఆమె పెళ్లి చేసుకోనుంది. గతంలో వీరిద్దరూ కలిసి బిజినెస్ ప్రారంభించారు. ఆ సమయంలో వీరి ఆలోచనలు, అభిరుచులు కలిసాయి. అప్పటి నుంచి ప్రేమించుకోవడం ప్రారంభించారు. రాజస్థాన్ జైపూర్ లోని 450 ఏళ్ల పురాతన రాచకోట ‘ముందోతా ఫోర్ట్ ప్యాలెస్’ లో వీరి పెళ్లి వైభవంగా జరుగనుంది. ఈ వేడుకకు వచ్చే అతిథుల కోసం హోటల్ లో అన్ని గదులు, సూట్స్ ని బుక్ చేశారు. వీరి పెళ్లి పనులు డిసెంబర్ 2 నుంచి ప్రారంభం అవుతాయి. డిసెంబర్ 3న మెహందీ, సంగీత్, డిసెంబర్ 4న పెళ్లి జరుగనుంది. అతిథులు, సన్నిహితులు మాత్రమే పెళ్లికి హాజరు కానున్నారు. ప్రతి రోజు డ్రెస్ కోడ్ ఉన్నట్టు సమాచారం.
Advertisement
Also Read : వీకెండ్ బరిలో 7 చిన్న సినిమాలు….ఆ సినిమాలు ఏవంటే..?
తాజాగా సోషల్ మీడియాలో హన్సిక ఫోటోలను షేర్ చేసింది. ఇందులో హన్సికకు కాబోయే భర్త సొహైల్ కతురియా ప్రపోజ్చేయగా.. అందుకు ఆమె అంగీకారం తెలుపుతూ హగ్ చేసుకుంది. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు కాబోయే జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం హన్సిక నటించిన పార్ట్నర్, 105 మినట్స్ చిత్రాల షూటింగ్స్ పూర్తవ్వగా.. తెలుగులో మై నేమ్ ఈజ్ శృతితో పాటు తమిళంలో కొన్ని సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో హన్సిక పెళ్లికి సంబంధించిన వార్త తెగ వైరల్ అవుతోంది.