Home » వీకెండ్ బ‌రిలో 7 చిన్న సినిమాలు….ఆ సినిమాలు ఏవంటే..?

వీకెండ్ బ‌రిలో 7 చిన్న సినిమాలు….ఆ సినిమాలు ఏవంటే..?

by AJAY
Ad

వీకెండ్ వచ్చిందంటే చాలు థియేటర్లలో కొత్త సినిమాల సందడి కనిపిస్తోంది. ప్రతి వీకెండ్ కు కొన్ని సినిమాలు విడుదలవుతుంటాయి. కాగా ఈ వీకెండ్ లో ఎక్కువగా చిన్న సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఏకంగా ఈ వారం ఏడు సినిమాలు విడుదల కాబోతున్నాయి. వాటిలో అల్లు శిరీష్ హీరోగా నటించిన ఊర్వశివో రాక్షసివో సినిమా కూడా ఒకటి. ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని చాలా కాలం అవుతుంది.

Advertisement

ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించగా బాలయ్య గెస్ట్ గా వచ్చి సందడి చేశారు. ఈ చిత్రంలో అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రం భారీ అంచనాల మధ్య నాలుగవ తేదీన థియేటర్లలో విడుదల కాబోతోంది. అంతేకాకుండా నాలుగవ‌ తేదీన సంతోష్ శోభన్ హీరోగా నటించిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.

Advertisement

సంతోష్ శోభన్ ఏక్ మినీ క‌థ‌ సినిమాతో ఓటీటీలో సూపర్ హిట్ అందుకున్నాడు. అదేవిధంగా పేపర్ బాయ్ సినిమాతోనూ డీసెంట్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక లైక్ షేర్ స‌బ్క్రైబ్ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించగా కామెడీ ఎంట‌ర్టైన‌ర్ గా ఈ చిత్రం తెర‌కెక్కింది. ఈ సినిమాకు మేర్ల‌పాక గాంధీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలతో పాటు జ‌ట్టి, బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాలో హీరో నందు యాంకర్ రష్మీ హీరో హీరోయిన్లుగా నటించారు. అంతేకాకుండా జెట్టి సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో నందితా శ్వేత లీడ్ రోల్ లో నటించింది. అదేవిధంగా ఈ సినిమాలతో పాటు తగ్గేదేలే, సారథి, బనారస్ సినిమాలు కూడా థియేటర్లలో విడుదల కానున్నాయి. మరి ఈ ఏడు చిత్రాలలో ఎన్ని ప్రేక్షకులను మెప్పిస్తాయో చూడాలి.

ALSO READ : అల్లు అర్జున్ రిజెక్ట్ చేయ‌డంతో విజ‌య్ దేవ‌ర‌కొండకు లైఫ్ ఇచ్చిన సినిమా ఏదో తెలుసా..ఎందుకు రిజెక్ట్ చేశాడంటే..?

Visitors Are Also Reading