Home » అల్లు అర్జున్ రిజెక్ట్ చేయ‌డంతో విజ‌య్ దేవ‌ర‌కొండకు లైఫ్ ఇచ్చిన సినిమా ఏదో తెలుసా..ఎందుకు రిజెక్ట్ చేశాడంటే..?

అల్లు అర్జున్ రిజెక్ట్ చేయ‌డంతో విజ‌య్ దేవ‌ర‌కొండకు లైఫ్ ఇచ్చిన సినిమా ఏదో తెలుసా..ఎందుకు రిజెక్ట్ చేశాడంటే..?

by AJAY
Ad

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా ప‌రషురామ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన గీతాగోవిందం సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఈ సినిమాలో ర‌ష్మిక మంద‌న హీరోయిన్ గా న‌టించగా ల‌వ్ అండ్ కామెడీ ఎంట‌ర్టైన‌ర్ గా ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. విజ‌య్ దేవ‌ర‌కొండ అర్జున్ రెడ్డి సినిమా లాంటి ట్రెండ్ సెట్ట‌ర్ లో న‌టించిన త‌ర‌వాత గీతాగోవిందం సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన సంగ‌తి తెలిసిందే. అర్జున్ రెడ్డితో విజ‌య్ దేవ‌ర‌కొండ యూత్ కు ఫేవ‌రెట్ గా మారిపోయాడు. కానీ ఫ్యామిలీ ఆడియ‌న్స్ కు ఈ సినిమా పెద్ద‌గా కనెక్ట్ అవ్వ‌లేదు.

Advertisement

ఆ వెంటనే వ‌చ్చిన గీతాగోవిందం సినిమా ఫ్యామిలీ ఆడియ‌న్స్ కు తెగ‌న‌చ్చేసింది. దాంతో విజ‌య్ దేవ‌ర‌కొండ క్రేజ్ ఎక్క‌డికో వెళ్లిపోయింది. వ‌రుస ఆఫ‌ర్ ల‌తో ఇండ‌స్ట్రీలో ఫుల్ బిజీగా మారిపోయాడు. కాబ‌ట్టి విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు గీతాగోవిందం సినిమా లైఫ్ ఇచ్చింద‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇదిలా ఉంటే మొద‌ట‌గా గీతాగోవిందం సినిమా ఆఫ‌ర్ విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌ద్ద‌కు రాలేదు అన్న సంగ‌తి చాలా మందికి తెలియ‌దు.

Advertisement

మొద‌ట‌గా గీతాగోవిందం సినిమాకు ద‌ర్శ‌కుడు ప‌రషురామ్ వేరే హీరోను అనుకున్నాడు. అల్లు శిరీష్ తో శ్రీర‌స్తు శుభ‌మస్తు సినిమా చేసిన త‌ర‌వాత ప‌రుషురామ్ గీతాగోవిందం సినిమా క‌థ‌ను రాసుకున్నార‌ట‌. అంతే కాకుండా ఈ సినిమా క‌థ‌ను మొద‌ట ప‌రషురామ్ అల్లు అర్జున్ కు వినిపించారట‌.

కానీ బ‌న్నీ అప్పుడే స‌రైనోడు సినిమాతో మాస్ హిట్ అందుకున్నాడు. అంతే కాకుండా కెరీర్ మొద‌ట్లో చాలా ప్రేమ‌క‌థా చిత్రాల‌లో నటించాన‌ని గీతాగోవిందం ను రిజెక్ట్ చేశాడ‌ట‌. కానీ స్క్రిప్ట్ న‌చ్చ‌డంతో బ‌న్నీ త‌మ బ్యాన‌ర్ లో చేసేలా ఒప్పందం చేసుకున్నార‌ట‌. ఆ త‌ర‌వాత ప్రాజెక్ట్ లోకి విజ‌య్ ఎంట్రీ ఇచ్చాడు. అలా తెర‌కెక్కిన గీతాగోవిందం బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది.

Visitors Are Also Reading