Home » విజయశాంతి కి కావాలనే ఆ ఇంజక్షన్ వేయించిన స్టార్ హీరోయిన్..ఎందుకంటే..?

విజయశాంతి కి కావాలనే ఆ ఇంజక్షన్ వేయించిన స్టార్ హీరోయిన్..ఎందుకంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

అలనాటి స్టార్ హీరోయిన్లలో ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి హీరోయిన్ విజయశాంతి. ఒకప్పుడు హీరోలతో సమానంగా పోటీపడి సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ పారితోషకం విషయంలో కూడా స్టార్ హీరోలతో ఈక్వల్ గా ఉండేదట. ఆమె ఇండస్ట్రీలో ఎన్నో సంచలమైన చిత్రాలు నటించి లేడీ సూపర్ స్టార్ గా మంచి గుర్తింపు సాధించింది.. వారి తరం స్టార్ హీరోలు అందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. చిరంజీవి,బాలకృష్ణ
లాంటి హీరోలందరితో నటించి మెప్పించింది ఈ లేడీ సూపర్ స్టార్.

Advertisement

also read;సమరసింహారెడ్డితో సహా బాలకృష్ణ, మణిశర్మ కాంబోలో వచ్చిన సినిమాలు ఇవే..!

అయితే ఈమె మొదటిసారి ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చింది. చెన్నైలో పుట్టి పెరిగిన విజయశాంతి మొదటిసారి భారతీరాజా డైరెక్షన్లో తమిళ సినిమా ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో కృష్ణ నటించిన కిలాడి కృష్ణుడు సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రానికి విజయనిర్మల డైరెక్షన్ చేయగా ఇది విజయశాంతికి మొదటి సినిమా. అయితే ఈ సినిమాకు విజయశాంతిని ఒకే చేసిన సమయంలో విజయశాంతి చాలా సన్నగా ఉందట.ఈ క్రమంలోనే విజయశాంతి లావు అవ్వడం కోసం కేవలం ఆరు నెలల సమయంలోనే ఆమె ఆకృతిని మార్చాలని అక్కడే ఉన్న ప్రభుత్వ డాక్టర్ కు చూపించిందట విజయనిర్మల.

Advertisement

దీంతో ఆమెను లావు చేసే బాధ్యత తీసుకున్నారు వైద్యుడు. ఈ విధంగా ఏడు వారాలకు ఒకసారి ఒక ఇంజక్షన్ చొప్పున ఇచ్చి మొత్తానికి బరువు పెరిగేలా చేశారు. అయితే ఇదే విషయాన్ని ఆ డాక్టర్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. అయితే ఆ విషయాన్ని అప్పట్లో అన్ని పత్రికలలో కూడా రాశారు. ఈ విధంగా ఆ సినిమా కోసం విజయశాంతి తీసుకున్న ఈ నిర్ణయం ప్రతి ఒక్కరిని ఫిదా చేసిందని చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత విజయశాంతి తెలుగు ఇండస్ట్రీలో వెనక్కి తిరిగి చూసుకోలేదు. అనేక సినిమాల్లో చేసి స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది.

also read;అనసూయ ప్రత్యేక పూజలు.. దేనికోసమో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?

Visitors Are Also Reading