Telugu News » Blog » సమరసింహారెడ్డితో సహా బాలకృష్ణ, మణిశర్మ కాంబోలో వచ్చిన సినిమాలు ఇవే..!

సమరసింహారెడ్డితో సహా బాలకృష్ణ, మణిశర్మ కాంబోలో వచ్చిన సినిమాలు ఇవే..!

by Anji
Ads

తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ, మణి శర్మ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాల్లో ఎక్కువగా మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి. సమరసింహారెడ్డితో మొదలైన వీళ్ల కాంబినేషన్‌ లయన్ వరకు కొనసాగింది. వీళ్ల కాంబినేషన్‌లో చిత్రాల్లోని గీతాలు ప్రేక్షకాదరణ పొందాయి. కొన్ని చిత్రాలు ఫ్లాప్‌గా కూడా నిలిచినా.. మ్యూజికల్‌గా మంచి సక్సెస్ అందుకున్నాయి. వీళ్ల కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

సమరసింహారెడ్డి 

Advertisement

Manam News

నందమూరి బాలకృష్ణ, మణిశర్మ కాంబినేషన్లో వచ్చిన మొదటి చిత్రం సమరసింహారెడ్డి ఈ సినిమా మ్యూజికల్ గా రీ రికార్డు పరంగా సంచలన మే క్రియేట్ చేసింది. బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రము ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

Advertisement

నరసింహనాయుడు
Manam News
బాలకృష్ణ కెరీర్ లోనే నరసింహనాయుడు ఒక బిగ్గెస్ట్  హిట్  అనే చెప్పాలి. ఈ సినిమా హిట్టు కావడానికి మణిశర్మ సంగీతం ఒక భాగమైతే.. బాలకృష్ణ మరొకటి భాగం. ఈ సినిమా కూడా బెజవాడ గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కింది.
భలే వాడివి బాసు
Manam News
బాలకృష్ణ మణిశర్మ కాంబినేషన్లో వచ్చిన మూడో చిత్రం భలేవాడివి బాసు.. ఈ చిత్రానికి అరుణ్ ప్రసాద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచినప్పటికీ.. మ్యూజిక్ పరంగా మాత్రం పర్వాలేదనిపించింది.
సీమ సింహం
Manam News
బాలకృష్ణ మన శర్మ కాంబోలో వచ్చిన నాలుగోవ చిత్రం సీమ సింహం. రాంప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రము యావరేజ్ టాక్ తెచ్చుకుంది.
చెన్నకేశవరెడ్డి
Chennakeshavareddy Manam News
వివివినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం చెన్నకేశవరెడ్డి. ఈ చిత్రానికి మని శర్మ సంగీతం అందించారు. మన శర్మ మ్యూజిక్ అదిరిపోయిందనే చెప్పాలి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. ఇటీవలే రీ రిలీజ్ లో సంచలన విజయం సాధించడం విశేషం.
పలనాటి బ్రహ్మనాయుడు 
Manam News
బి.గోపాల్ దర్శకత్వంలో బ్రహ్మనాయుడు చిత్రం తెరకెక్కింది. బాలయ్య మణిశర్మ కాంబినేషన్లో పలనాటి బ్రహ్మనాయుడు ఆరవ చిత్రం. ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.
లక్ష్మీనరసింహ
Manam News
బాలయ్య మణిశర్మ కాంబోలో వచ్చిన ఏడో చిత్రం లక్ష్మీనరసింహ. జయంత్ సి ఫరాన్జీ దర్శకత్వంలో  తెరకెక్కింది ఈ చిత్రం. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.
అల్లరి పిడుగు
,Manam news
బాలకృష్ణ మణిశర్మ కాంబోలో వచ్చిన ఎనిమిదవ చిత్రం అల్లరి పిడుగు.  జయంత్ సి ఫరాన్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గానే మిగిలింది.

You may also like