Home » హీరోయిన్ రాశిని అలా చేసి మోసం చేసిన స్టార్ డైరెక్టర్..!!

హీరోయిన్ రాశిని అలా చేసి మోసం చేసిన స్టార్ డైరెక్టర్..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నారు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం తక్కువ మంది హీరోయిన్లు ఉండేవారు. అప్పటి హీరోయిన్లలో ఏ హీరోయిన్ గురించి కూడా తక్కువ చెప్పలేం.. ఎవరి గురించి చూసిన రికార్డులు క్రియేట్ చేసిన వారే ఉన్నారు.. అలాంటి అందమైన హీరోయిన్లలో రాశి ఒకరు.. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన అందాల ముద్దుగుమ్మ హీరోయిన్ రాశి. అప్పుడు యూత్ కలల రాకుమారిగా పేరు తెచ్చుకుంది. హీరో పవన్ కళ్యాణ్ గోకులంలో సీత అనే సినిమా ద్వారా మంచి గుర్తింపు సాధించిన రాశి ఆ తర్వాత వెనక్కి చూసుకోలేదు.

Advertisement

Also Read:ఆస్తిలో తారకరత్న వాటాను ఆ ట్రస్ట్ కు రాశారా… అలేఖ్య రెడ్డికి అన్యాయమేనా?

Advertisement

జగపతిబాబుతో శుభాకాంక్షలు , పెళ్లి పందిరి వంటి బ్లాక్ బాస్టర్ సినిమాలు చేసి ఇండస్ట్రీలోనే తిరుగులేని హీరోయిన్గా మారింది. అలా కొన్ని ఏండ్ల పాటు ఇండస్ట్రీలో కొనసాగిన ఈ ముద్దుగుమ్మ తన కెరియర్ ముగిసిన తర్వాత వెంకీ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో కూడా చేశారు. అంతేకాకుండా డైరెక్టర్ తేజ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన నిజం మూవీలో విలన్ అయినా గోపీచంద్ పక్కన కీ** గా చేసింది. దీంతో ఆమె అభిమానుల నుంచి నెగిటివ్ షేడ్స్ పడింది. ఆ క్యారెక్టర్ లో రాశి ని చూసిన వారంతా అప్పట్లో హీరోయిన్గా చేసిన రాశి ఈవిడేనా అనే డౌట్ కూడా వచ్చిందట.

ఈ విధంగా ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ రాశికి చాలా మైనస్ అయిందని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.. ముందుగా డైరెక్టర్ తేజ నాకు ఆ క్యారెక్టర్ అలా ఉంటుందని చెప్పలేదు రౌడీ భార్యగా చేయాలి అంటే ఒప్పుకున్న తీరా టైం కి నాకు క్యారెక్టర్ చెబితే నేను చేయలేను అని చెప్పాను. కానీ తేజ మీరు చేయకపోతే షూటింగ్ ఆగిపోతుందని ఎంత చెప్పినా వినకుండా టీం మొత్తం మెస్మరైజ్ చేశారట. దీంతో తప్పక ఆ క్యారెక్టర్ చేశానని చెప్పుకొచ్చింది రాశి.ఈ విధంగా తేజా నన్ను మోసం చేశారంటూ అసలు విషయాన్నీ బయట పెట్టింది.

Also Read:ఇండియన్-2 లో 7 గురు విలన్లు..ముగ్గురు హీరోయిన్లు !

Visitors Are Also Reading