Home » ఇండియన్-2 లో 7 గురు విలన్లు..ముగ్గురు హీరోయిన్లు !

ఇండియన్-2 లో 7 గురు విలన్లు..ముగ్గురు హీరోయిన్లు !

by Bunty
Ad

శంకర్ కమలహాసన్ కాంబోకు తిరుగులేదు. గతంలో వీరు కాంబోలో తెరకెక్కిన ‘భారతీయుడు’ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. సినిమా వచ్చి 21 ఏళ్లు అవుతున్న ప్రేక్షకుల్లో ఇప్పటికీ ఈ మూవీపై ఉన్న క్రేజ్ తగ్గలేదు. కాగా ఇప్పుడు ఇండియన్-2 తెరకెక్కడానికి సిద్ధమైంది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, రెడ్ జియాంట్ మూవీస్ బ్యానర్లపై ఏ సుభాష్కరన్, ఉదయనిది స్టాలిన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Advertisement

ఇక ఈ చిత్రంలో ఏడుగురు విలన్స్ నటిస్తున్నారని కోలీవుడ్ మీడియా తెలుపుతోంది. తెలుగుకు చెందిన ప్రముఖ కమెడియన్ కూడా విలన్ రోల్ చేస్తుండటం చెప్పుకోదగ్గ విశేషం. సముద్రఖని, బాబీ సింహ, జయప్రకాష్, గురు సోమ సుందరం, మారిముత్తు, వెన్నెల కిషోర్, శివాజీ కురువాయుర్ ప్రతినాయక పాత్రను చేస్తున్నారు. మొత్తం మీద ముగ్గురు హీరోయిన్లు, ఏడుగురు విలన్లతో కమలహాసన్ ఇండియన్ టు చిత్రంలో మరోసారి తెరపై విజృంభిస్తున్నారన్నమాట.

Advertisement

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలోని ఆదిత్య రామ్ స్టూడియోస్ లో జరుగుతుంది. కమల్ చిత్రీకరణలో భాగంగా సినిమాలోని ఏడుగురు విలన్స్ తో పోరాడుతున్నారు. ఇండియన్ 2 ను లైకా ప్రొడక్షన్స్, రెడ్ జియాంట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియ భవాని శంకర్, మనోబాల తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

READ ALSO : ఏపీ పోలీస్ అభ్యర్థులకు అలర్ట్…మార్చి 1 నుంచి కాల్ లెటర్లు… మెయిన్ ఎగ్జామ్ ఎప్పుడంటే?

Visitors Are Also Reading