Home » బిగ్ బాస్ 7 మినీ లాంచ్ లో నాగార్జున వేసుకున్న షర్ట్ ఖరీదు ఎంతో తెలుసా..?

బిగ్ బాస్ 7 మినీ లాంచ్ లో నాగార్జున వేసుకున్న షర్ట్ ఖరీదు ఎంతో తెలుసా..?

by Anji
Ad

 టాలీవుడ్ కింగ్ నాగార్జున గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా నాగార్జున ఏ పని చేసిన చాలా స్పెషల్ గానే ఉంటుంది. అంతేకాదు..  ఇప్పటికి కూడా చెక్కుచెదరని అందంతో యంగ్ హీరో మాదిరిగా  తన అందాన్ని రోజురోజుకీ మెయింటైన్ చేస్తున్నారు. ఇక ఈ మధ్య కాలంలో కాస్త కొడుకుల సినీ కెరీర్ గురించి ఆలోచిస్తూ.. డిప్రెషన్ లోకి వెళ్లినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇంట్లోవాళ్ల ముందు ఎలా ఉన్నా సరే ఒకసారి బయటికి వచ్చారంటే వాటన్నింటిని  మర్చిపోయి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికే చూస్తారు నాగార్జున.

Advertisement

అయితే ప్రస్తుతం నాగార్జున బిగ్ బాస్ 7 కి హోస్ట్ గా చేసిన సంగతి మనందరికీ  తెలిసిందే. ఇక ఈసారి బిగ్ బాస్ 7 లో హౌస్ లోకి 14 మంది కంటెస్టెంట్లు వెళ్లారు. ఇందులో నుంచి ఇప్పటికే ఐదుగురు ఎలిమినేట్ అయ్యారు. ఒకరు సీక్రెట్ రూమ్ లో ఉన్నారు. హౌస్ లో 8 మంది ఉండగా ఇంకో ఐదుగురిని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపారు. అందులో ఒకరు అంబటి అర్జున్, బోలే షావలి, నయని పావని, పూజ మూర్తి,అశ్విని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక నిన్న జరిగిన బిగ్ బాస్ మినీ లాంచ్ లో హీరో సిద్ధార్థ్ తో పాటు టైగర్ నాగేశ్వరరావు సినిమా హీరో రవితేజ అలాగే ఇద్దరు హీరోయిన్స్ కూడా వచ్చారు.

Advertisement

ఇదంతా పక్కన పెడితే నాగార్జున బిగ్ బాస్ 7 మినీ లాంచ్ రోజు వేసుకున్న షర్టు ప్రస్తుతం అందర్నీ ఆకర్షిస్తుంది. చూడ్డానికి చాలా డిఫరెంట్ గా ఉన్న ఆ షర్ట్ కాస్ట్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. మరి నాగార్జున వేసుకున్న ఆ షర్ట్ ఖరీదు ఎన్ని లక్షలో ఇప్పుడు తెలుసుకుందామా.. చఅక్కినేని నాగార్జున ట్రెండుకు తగ్గట్టు ఫిజిక్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు.అంతేకాదు యంగ్ హీరోలాగే డ్రెస్సులు వేసుకుంటూ అందరిని ఆకర్షిస్తారు.అందుకే ఈయన్ని టాలీవుడ్ మన్మధుడు, కింగ్ ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తారు. ఇక నిన్న బిగ్ బాస్ మినీ లాంచ్ ఈవెంట్లో ఆయన వేసుకున్న డ్రెస్ ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. అంతేకాదు ఆ డ్రెస్సు ధర ఏకంగా రెండు లక్షలకు పైమాటే అని తెలుస్తోంది. ఇక ఒక్క షర్ట్ కాస్ట్ రెండు లక్షలా అని ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు నాగార్జున అంటే ఆ మాత్రం ఉంటుంది మరీ అని కూడా కామెంట్లు పెడుతున్నారు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

 బాలకృష్ణను మోసం చేసిన వెంకటేష్ .. ఇన్నాళ్లకు ఇప్పుడు వెలుగులోకి..!

 

Visitors Are Also Reading