Home » స్కూటీ ధర రూ.1లక్ష.. ఫ్యాన్సీ నెంబర్ కి మాత్రం రూ.కోటికి పైగా..!

స్కూటీ ధర రూ.1లక్ష.. ఫ్యాన్సీ నెంబర్ కి మాత్రం రూ.కోటికి పైగా..!

by Anji
Ad

సాధారణంగా ఈ మధ్య కొన్ని ఆసక్తికరమైన ఘటనలు చూసి మనం ఆశ్చర్యపోతాం. అందరూ ఆశ్చర్యపోయే ఘటన ఒకటి హిమాచల్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. సిమ్లాలో ఓ స్కూటీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ కోసం అక్షరాల కోటి రూపాయలకు పైగా పలికింది. తాను కొత్తగా కొన్ని స్కూటీ కోసం ఓ ఫ్యాన్సీ నెంబర్ ని దక్కించుకునేందుకు భారీ మొత్తంలో రవాణా శాఖకు సమర్పించుకునేందుకు సిద్ధమయ్యాడు ఓవాహనదారుడు. హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాకి చెందిన వాహనదారుడితో పాటు దాదాపు 26 మంది ఆ నెంబర్ ని సొంతం చేసుకునేందుకు పోటీ పడ్డారు. సిమ్లా కోట్ ఖాయ్ ప్రాంతానికి చెందిన వాహనదారుడు ఈ వేలంలో అత్యధిక ధరకు బిడ్ వేసాడు. 

Advertisement

కోట్ ఖాయ్ ప్రాంతానికి చెందిన వాహనదారుడు HP 999999 ఫ్యాన్సీ నెంబర్ కోసం రూ.కోటి 11వేలు బిడ్డింగ్ వేసాడు. ఈ వీవీఐపీ నెంబర్ కోసం 26 పోటీలో పాల్గొన్నారు.  వాస్తవానికి దీని రిజర్వ్ ధర రూ.1000గా ఫిక్స్ చేసారు అధికారులు. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు వేలానికి దరఖాస్తులు స్వీకరించారు. ఆ తరువాత నెంబర్లను అధిక ధర కోట్ చేసిన వ్యక్తులకు కేటాయిస్తారు. ఈ వీఐపీ నెంబర్ల జాబితాలో చాలా నెంబర్లు ఉన్నాయి.వాటిలో HP990009 నెంబర్ రూ.21 లక్షలు కాగా.. HP990005 రూ. 20లక్షలు, HP990003 రూ.10 లక్షలు వంటి నెంబర్లు వేలంగా ఉన్నప్పటికీ అందరి దృష్టి మాత్రం HP 999999 నెంబర్ మీద పడింది. 

Advertisement

Also Read :  ICC Mistake : ఐసీసీ తప్పిదంతో టీమిండియాకు ఘోర అవమానం..!

Manam News

ఇక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ నెంబర్ ని దక్కించుకున్న వ్యక్తి రూ.లక్ష పెట్టి స్కూటీని కొనుగోలు చేయగా.. దానిని రిజిస్ట్రేషన్ నెంబర్ కోసం మాత్రం ఏకంగా రూ.కోటి 11వేలు బిడ్డింగ్ వేయడం విశేషం. సాధారణంగా ఎవరైనా రూ.కోట్లు విలువ చేే కార్ల కోసం ఇంత పెద్ద మొత్తంలో వెచ్చించి ఫ్యాన్సీ నెంబర్లను పొందుతుంటారు. కానీ స్కూటీ కోసం ఇంత మొత్తంలో బిడ్డింగ్ వేయడాన్ని చూసి అధికారులే ఆశ్చర్యపోవడం విశేషం.  రవాణా శాఖ వీఐపీ నెంబర్లు అంటూ పలు సిరిస్ లను అమ్మేందుకు ఉంచుతుంది. వీటినే ఫ్యాన్సీ, వీఐపీ, వీవీఐపీ నెంబర్లు అంటారు. వీటిపై ఆసక్తి ఉన్నవారు అధికారులు నిర్దేశించిన రుసుమును చెల్లించి మనకు నచ్చిన నెంబర్ ని పొందవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో ఒకే నెంబర్ కోసం చాలా మంది పోటీ పడుతుంటారు. అలాంటి సమయాల్లో బిడ్డింగ్ ప్రక్రియను చేపడుతారు. ఈ పోటీలో ఎంత ఖర్చు చేసి అయినా సరే చివరికి వారికి నచ్చని రిజిస్ట్రేషన్ నెంబర్ ని దక్కించుకుంటారు.  అలా సిమ్లాకు చెందిన వాహనదారుడు కూడా దక్కించుకున్నాడు. 

Also Read :  Sir Movie Review : ధనుష్ ఖాతాలో మరో హిట్ పడ్డట్టేనా..? ‘సార్’ ఎలా ఉందంటే..?

Visitors Are Also Reading