Home » ఆ హీరోయిన్లకు భర్తగా నటించిన హీరోలే అన్నగా నటించిన సినిమాలు ఇవే..!

ఆ హీరోయిన్లకు భర్తగా నటించిన హీరోలే అన్నగా నటించిన సినిమాలు ఇవే..!

by Anji

సాధారణంగా ఒక సినిమాలో భార్య, భర్తలుగా నటించిన వారు మరో సినిమాలో మరోపాత్రలో ఇలా రకరకాల పాత్రలు చేస్తుంటారు. కొంత మంది హీరోలతో నటించిన తరువాత వారి కొడుకులతో కూడా హీరోయిన్ గా నటించిన వారున్నారు. అదేవిధంగా భార్య భర్తలుగా నటించిన వారు అన్న చెల్లెల్లుగా నటిస్తే అస్సలు ఊహించుకోవడానికి అంతగా బాగుండదనే చెప్పాలి. ఎందుకంటే భార్య భర్తలుగా నటించిన పాత్రల్లో వారు కొన్ని ప్రత్యేక సీన్లలో నటించడంతో వారిని చూడగానే రియల్ కపుల్స్ మాదిరిగా కనిపిస్తుంటారు. అలా అకస్మాత్తుగా అన్నచెల్లెలు చేయాలంటే సులువుగా చేస్తుంటారు తెలుగు నటీనటులు. కొంత మందిని ప్రేక్షకులు భార్యభర్తలుగానే చూడాలనుకుంటారు. అన్న చెల్లెలుగా చూపించడం వల్ల ప్లాప్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఇప్పటివరకు ఈ విధంగా నటించిన హీరో, హీరోయిన్లు ఎవరు ? వాళ్లు నటించిన సినిమాలు ఏవి? సక్సెస్ అయ్యాయో లేదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఎన్టీఆర్-సావిత్రి :

ఎన్టీఆర్-సావిత్రి జంట చాలా సినిమాల్లో హీరో, హీరోయిన్ గా నటించిన విషయం అందరికీ తెలిసిందే. కానీ వీరు అన్న చెల్లెలుగా నటించిన సినిమా గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. రక్తసంబంధం మూవీలో అన్నా చెల్లెలుగా నటించారు ఎన్టీఆర్-సావిత్రి. ఇక అప్పటివరకు వీరిని భార్య భర్తలుగా, ప్రేమికులుగా కనిపించిన వీరు అకస్మాత్తుగా అన్న చెల్లెలుగా నటించడంతో ప్రేక్షకులు కనెక్ట్ కాలేదు. ఈ సినిమాకి ఆశించిన ఫలితం దక్కలేదు. 

 కృష్ణ-సౌందర్య :

టాలీవుడ్ సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ, హీరోయిన్ సౌందరయ చాలా సినిమాల్లో జంటగా నటించారు. అయితే వీరిద్దరూ కలిసి రవన్న మూవీలో మాత్రం అన్న చెల్లెలు పాత్రలో కనిపించారు. అప్పటివరకు వీరిని కపుల్ గా చూసిన వారు సడెన్ అన్న చెల్లెలుగా చూడలేకపోయారు. దీంతో ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. 

రమ్యకృష్ణ-నాజర్ :

రమ్యకృష్ణ-నాజర్ గతంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన నరసింహా మూవీలో అన్నాచెల్లెలుగా నటించారు. ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయింది. ఇక దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలో భార్య భర్తలుగా నటించారు రమ్యకృష్ణ-నాజర్. ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. 

ప్రకాశ్ రాజ్-జయసుధ :

ప్రకాశ్ రాజ్-జయసుధ చాలా సినిమాల్లో భార్య, భర్తలుగా నటించారు. కానీ సోలో సినిమాలో మాత్రం అక్కాతమ్ముడిగా నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. దీంతో ప్రేక్షకులు వీరిని చూడటానికి ఇష్టపడలేదు. అందుకే ఈ మూవీ అంతగా సక్సెస్ సాధించలేకపోయింది. 

చిరంజీవి-నయనతార :

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత రెండో మూవీగా సైరా నరసింహారెడ్డి వచ్చింది. ఇందులో చిరంజీవి, నయనతార భార్యభర్తలుగా కనిపించారు. కానీ ఇటీవల వచ్చిన గాడ్ ఫాదర్ మూవీలో చిరంజీవి-నయనతార అన్నాచెల్లెలుగా నటించారు. ఆ సమయంలో వీరిని సోషల్ మీడియాలో ట్రోల్స్ బాగానే చేశారు. ఈ సినిమా యావరేజ్ టాక్ తో దూసుకెళ్లింది. కలెక్షన్ల పరంగా నిర్మాతలకు కొంచెం నష్టాన్నే మిగిల్చిందని టాక్ వినిపించింది. 

 మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

చాలా మందికి లైఫ్ ఇచ్చిన రాకేష్ మాస్టర్.. అనాథ ఆశ్రమంలో చేరడానికి కారణం ఏంటో తెలుసా ?

 ఆదిపురుష్ మూవీకి ఎదురుదెబ్బ.. టికెట్స్ క్యాన్సిల్

ఏంటి.. ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు డాన్స్ స్టెప్స్ ని ఆ స్టార్ హీరో సినిమా నుంచి కాపీ కొట్టేశారా…!

Visitors Are Also Reading