Home » ఏంటి.. ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు డాన్స్ స్టెప్స్ ని ఆ స్టార్ హీరో సినిమా నుంచి కాపీ కొట్టేశారా…!

ఏంటి.. ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు డాన్స్ స్టెప్స్ ని ఆ స్టార్ హీరో సినిమా నుంచి కాపీ కొట్టేశారా…!

by Mounika

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన అద్భుతమైన చిత్రాలలో ఆర్ఆర్ఆర్ ఒకటి. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఈ భారీ మల్టీస్టారర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఎంతో సంచలనం సృష్టించింది. స్వతంత్రం సాధించడానికి ముందు జరిగిన కథను ఆధారంగా చేసుకుని చరిత్రలో ఎప్పుడు కలవని ఇద్దరు వీరులు కలిస్తే, వారి మధ్య స్నేహం చిగురిస్తే ఎలా ఉంటుంది అనే కథాంశంపై జక్కన్న రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల మనసులను దోచుకుంది. ఆర్ఆర్ఆర్ లో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ , గిరిజన వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పాత్రల్లో ఎంతో అద్భుతంగా నటించారు.

500 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ చిత్రం 1000 కోట్లకు పైగా వసూల్ రాబట్టి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పింది. ఒక అద్భుతమైన స్నేహబంధాన్ని తెరపై ఎక్కించడంలో రాజమౌళి నూటికి నూరు శాతం విజయాన్ని సాధించారని చెప్పుకోవచ్చు. హాలీవుడ్ సినీ ప్రముఖుల సైతం రాజమౌళి దర్శక ప్రతిభకు జోహార్ పలికారు. దీంతో హాలీవుడ్ లో సైతం ఆర్ఆర్ఆర్ పలు అవార్డులను సొంతం చేసుకునేలా చేసింది. ఈ క్రమంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుని కూడా ఆర్ఆర్ఆర్ కైవసం చేసుకుంది.

ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇక ఈ చిత్రంలో నాటు నాటు పాట యావత్ ప్రపంచాన్నే ఉరూతలూగించింది. చిన్న, పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ పాటకు స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేసేవారు. ఈ పాటకి గాను ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు. ఈ విషయం అంతా పక్కన పెడితే.. ఈ పాటపై ఇప్పుడు కొత్త విషయం వైరల్ అవుతుంది.

నాటు నాటు సాంగ్ లోని ఫేమస్ స్టెప్స్ ని ఒక ప్రముఖ హీరో సినిమా నుంచి కాపీ కొట్టేశారంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో హల్చల్ చేస్తుంది. ఇంతకీ ఆ హీరో ఎవరు..? ఆ సినిమా ఏంటి..? అనే విషయానికి వెళ్తే.. 1996లో తమిళ స్టార్ హీరో విజయ్ కోయంబత్తూరు మాపిళ్ళై అనే చిత్రంలో నటించారు. ఆ చిత్రంలో విజయ్ చేసిన డాన్స్ స్టెప్స్, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మూవీ లోని జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ చేసిన డాన్స్ స్టెప్స్ సేమ్ టు సేమ్ ఉన్నాయంటూ వీడియో వైరల్ అవుతుంది.

Watch this video

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

SV కృష్ణా రెడ్డి, చిరంజీవి కాంబినేషన్ లో సినిమా ఎందుకు మిస్ అయిందంటే ?

“ఎన్టీఆర్” బ్లాక్ బస్టర్ “స్టూడెంట్ no 1 ” సినిమాని చేతులారా మిస్ చేసుకున్న హీరో ఎవరంటే ?

మొదట ప్లాప్ టాక్ ని అందుకొని ఆ తర్వాత సెన్సేషనల్ హిట్ అయిన మహేష్ బాబు చిత్రాలు ఏవో తెలుసా..?

Visitors Are Also Reading