Home » వెల్లుల్లికి వారు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.. ఒకవేళ తింటే అంతే సంగతులు..!

వెల్లుల్లికి వారు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.. ఒకవేళ తింటే అంతే సంగతులు..!

by Anji
Ad

సాధారణంగా వెల్లుల్లి లేనిదే మన భారతీయ వంటకాలలో అసలు రుచి ఉండదు.  ప్రతీ ఇంట్లో తప్పకుండా వెల్లుల్లి ఉంటుంది. వీటిని కేవలం కూరల్లో వేస్తారనుకుంటే పొరపాటే.. ఇందులో చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వెల్లుల్లిలో ముఖ్యంగా కాల్షియం, కాపర్, పొటాషియం, పాస్పరస్, ఐరన్, విటమిన్ బి1 వంటి పోషకాలున్నాయి. రుచిని పెంచడంతో పాటు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ప్రస్తుతం వెల్లుల్లిని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో కూడా వినియోగిస్తున్నారు. కొందరూ మాత్రం వెల్లుల్లికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది వారు ఎవ్వరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

ప్రధానంగా వెల్లుల్లి ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ యొక్క రక్తపోటు తగ్గుతుంది. ఇప్పటికే తక్కువ రక్తపోటుతో ఇబ్బంది పడుతున్న వారు వెల్లుల్లిని ఎక్కువగా అసలు తీసుకోకూడదు. ఈ సమస్యతో సతమతమవుతున్నవారు వెల్లుల్లికి దూరంగా ఉండడమే మంచిది అంటున్నారు వైద్య నిపుణులు. వెల్లుల్లిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ నోటి దుర్వాసన వస్తుంది. ఇది మాత్రమే కాదు.. కొన్నిసార్లు చెమట, దుర్వాసన ప్రారంభం అవుతుంది. నోటి దుర్వాసన, చెమట సమస్యలతో ఇబ్బందిపడేవారు కూడా వెల్లుల్లిని ఎక్కువగా తీసుకోకపోవడమే ఉత్తమం. 

Advertisement

Also Read :   తేనెలో నానబెట్టిన ఉల్లిపాయలు ఖాళీ కడుపుతో తీసుకుంటే కలిగే ఫలితం గురించి  తెలిస్తే ఇక వదలిపెట్టరు..!

Manam News

ఇక ఈ వెల్లుల్లిలో యాసిడ్ ఉంటుంది. కాబట్టి దీనిని ఎక్కువ తినడంతో గుండెలో మంట వచ్చే అవకాశముంటుంది. ఎసిడిటి సమస్యలు ఉన్నవారు కూడా వెల్లుల్లిని చాలా తక్కువగానే తీసుకోవాలి. మీకు బలహీనమైన జీవక్రియ లేదా జీర్ణ సమస్యలుంటే వెల్లుల్లిని అసలు తీసుకోకూడదు. ఒకవేళ మీరు వెల్లుల్లిని ఆహారంలో తీసుకున్నట్టయితే మీ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. కొన్ని సమస్యల కారణంగా బ్లడ్ థిన్నర్ తీసుకుంటే..వెల్లుల్లిని తక్కువ మోతాదులో తీసుకోవడం ఉత్తమం. ఇక ఎక్కువగా వెల్లుల్లుని తిన్నట్టయితే మీ సమస్యలు పెరిగే అవకాశం ఉంది జాగ్రత్త..!

Also Read :  మరిగించిన నిమ్మకాయ నీరు తాగితే ఇన్ని లాభాలా..? ఏ సమయంలో తాగాలంటే..!

Visitors Are Also Reading