Home » మరిగించిన నిమ్మకాయ నీరు తాగితే ఇన్ని లాభాలా..? ఏ సమయంలో తాగాలంటే..!

మరిగించిన నిమ్మకాయ నీరు తాగితే ఇన్ని లాభాలా..? ఏ సమయంలో తాగాలంటే..!

by Anji
Ad

సాధారణంగా నిమ్మకాయ వల్ల ఎన్ని లాభాలు కలుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా నిమ్మకాయలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. నిమ్మరసంలో తేనె కలుపుకొని తాగడం వల్ల శరీరంలో ఉన్నటువంటి కొవ్వు చాలా త్వరగా కరిగిపోతుంది. అదేవిధంగా శరీరం డీ హై డ్రేషన్ నుంచి ఉపశమనం కలిగేవిధంగా చేస్తుంది. అలాగే మరిగించిన నిమ్మకాయ నీరును తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

Advertisement

ఆరోగ్యం నుంచి మొండి మచ్చల వరకు నిమ్మకాయలతో చాలా ఉపయోగాలు ఉంటాయి. కొంత మంది పరిగడుపున నిమ్మకాయ రసం తాగే అలవాటు ఉంటుంది. చిన్న నిమ్మకాయ చాలా పెద్ద సమస్యలను తగ్గిస్తాయి. మీరు నిమ్మకాయని మరిగించి దాని రసం తీసుకున్నారా..? దాని వల్ల కలిగే ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. 

Also Read :   తెలంగాణలో గ్రూపు 4 పరీక్ష ఎప్పుడో తెలుసా ? 

Manam News

Advertisement

మరిగించిన నిమ్మకాయ వాటర్ ని తీసుకోవడం ప్రారంభించండి. దీనిని తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ, చర్మ సంబంధ సమస్యలు తగ్గిపోతాయి. అదేవిధంగా ఉడకబెట్టిన నిమ్మకాయ నీరు, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఉదయం పరిగడుపున ఉడికించిన నిమ్మరసం తీసుకుంటే శరీరానికి మరింత మేలు జరుగుతుంది. నీటిని మరిగించి అందులో సగం నిమ్మకాయను పిండుకోవాలి. కొద్ది సేపు మరిగించిన తరువాత దానిని తీసేసి చల్లార్చిన తరువాత తీసుకోవాలి. ఈ నిమ్మకాయ నీరు నుంచి చాలా ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. వేడి నిమ్మరసం చేయడానికి మరో పద్దతిని కూడా పాటించవచ్చు. ఒక గిన్నెలో నీటిని మరిగించి శుభ్రంగా కడిగిన 6 నిమ్మకాయలను వేయాలి. కనీసం 5 నిమిషాల పాటు మరిగించాలి. అది చల్లారిన తరువాత మీరు దానిని తీసుకోవచ్చు. ఇది మీ రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా చర్మ సంబంధిత సమస్యలను నయం చేస్తుంది. 

Also Read :  జలుబు లేదా ఒమిక్రాన్ బీఎఫ్ 7 వేరియంట్ ని గుర్తించడం ఎలా ? వీటికి తేడా ఏంటి..?

Visitors Are Also Reading