తమిళ యాక్టర్ అర్జున్ దాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇతని కన్నా ఎక్కువ అతని వాయిస్ కే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇతను 2012లో తాను దుబాయిలో చేస్తున్న జాబ్ నీ వదిలేసి సినిమాలపై ఉన్న ఇష్టంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. అలా ఎన్నో ఆడిషన్స్ లో పార్టిసిపేట్ చేశారు. కానీ తన వాయిస్ నచ్చకపోవడంతో ఎవరు సినిమాలలో తీసుకోవడానికి ఒప్పుకోలేదు.
Advertisement
ఇక 2012 సంవత్సరంలో తమిళ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ‘పెరుమాన్’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా తర్వాత ఇతనికి పెద్దగా అవకాశాలు రాలేదు. ఒకటి, రెండు సినిమాలలో నటించి పక్కకు తప్పుకున్నారు. ఆ తర్వాత తమిళ సినిమా ‘ఖైతి’ కోసం ఆడిషన్స్ జరుగుతున్న సమయంలో అక్కడికి వెళ్లారట. తన యూనిక్ వాయిస్ తో అక్కడ ఉన్న వారిని మెప్పించి సినిమాల్లో స్థానాన్ని దక్కించుకున్నారు.
Advertisement
ఈ సినిమాలలో తన నటనకు గాను ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత అర్జున్ దాస్ తెలుగు ఇండస్ట్రీకి కూడా ఎంట్రీ ఇచ్చి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. ‘బుట్ట బొమ్మ’ , ‘ఓజి’ సినిమాల్లో అద్భుతంగా నటించారు. ఇక ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోనే మోస్ట్ ఇంపార్టెంట్ హీరోగా ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు.
ఇవి కూడా చదవండి
రోజా దగ్గర 20కి పైగా ఖరీదైన కార్లు… ఆమె ఆస్తి ఎంతో తెలుసా ?
OG Movie : పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో మహేష్ బాబు గెస్ట్ రోల్?
బన్నీ మొదటి జీతం రూ.3500 మాత్రమే..ఇప్పుడు ఆయన ఆస్తుల విలువెంతో తెలుసా?