Home » పవన్‌ కళ్యాణ్‌ పేరుకు చరణ్‌ కూతురు పేరుకు మధ్య సంబంధం ఇదే

పవన్‌ కళ్యాణ్‌ పేరుకు చరణ్‌ కూతురు పేరుకు మధ్య సంబంధం ఇదే

by Bunty
Ad

మెగా పవర్ స్టార్ రాంచరణ్ మరియు ఉపాసన గత పది రోజుల కిందట తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. జూన్ 20వ తేదీన పండంటి ఆడబిడ్డకు మెగా కోడలు ఉపాసన జన్మనిచ్చింది. దీంతో మెగా కుటుంబంలో కొత్త ఉత్సాహం నెలకొంది. ఇక తాజాగా అంటే నిన్న మెగా వారసురాలు బారసాల కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు.

Advertisement

ఈ సందర్భంగా మెగా వారసురాలకు క్లిమ్ కార అనే పేరును ఫైనల్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక గా కూడా ప్రకటించారు. ఈ తరుణంలోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేరు మెగా వారసురాలు పేరు ఒకేలా ఉన్నాయని కొంతమంది చెబుతున్నారు. బాబాయ్ పవన్ కళ్యాణ్ పై ప్రేమతో రామ్ చరణ్ ఈ పేరు పెట్టినట్లు ప్రచారం చేస్తున్నారు. మరి దీనికి కారణాలు లేకపోలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అసలు పేరు కళ్యాణ్ కుమార్ కొణిదెల.

Advertisement

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సమయంలో కళ్యాణ్ కుమార్ కొణిదల కాస్త… పవన్ కళ్యాణ్ గా మారిపోయింది. కళ్యాణ్ కుమార్ కొణిదల అంటే KKK. షార్ట్ కట్ లో KKK వస్తుంది. ఇక క్లిమ్ కార కొణిదల పేరు కూడా KKK నే వస్తుంది. ఇలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరుకు రామ్ చరణ్ కూతురు పేరుకు సంబంధం కలుపుతున్నారు. ఇప్పుడు ఈ అంశం సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. కాగా,ఉపసాన డెలీవరీ ఖర్చులు దాదాపు కోటిన్నర రూపాయలు అయ్యాయట. ఈ ఖర్చును పూర్తిగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ కట్టారు. కాగా, మెగా పవర్ స్టార్ రాంచరణ్ మరియు ఉపాసనల వివాహం 11 ఏళ్ల కిందట అయింది.

ఇవి కూడా చదవండి

బట్లర్‌కు రాజస్తాన్‌ రాయల్స్‌ బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.40 కోట్లు!

Sanju Samson : అయ్యర్ ఔట్.. 7 నెలల తర్వాత శాంసన్ రీఎంట్రీ..ఇకపై వరుసగా ఛాన్స్‌లే..?

2011 వన్డే వరల్డ్ కప్‌లో ధోనీ ‘కిచిడీ’ సెంటిమెంట్… సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్..

Visitors Are Also Reading