Home » గుంటూరు కారం చివరి 25 నిమిషాలు మామూలుగా ఉండదట..!

గుంటూరు కారం చివరి 25 నిమిషాలు మామూలుగా ఉండదట..!

by Anji
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. ఈయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకోవడమే కాకుండా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న గుంటూరు కారం సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని, చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో చివరి 25 నిమిషాలు మాత్రం మహేష్ బాబు నట విశ్వరూపం చూపిస్తాడంటూ సినిమా నుంచి ఒక వార్త అయితే వినిపిస్తుంది.

Advertisement

ఇక ఈ క్యారెక్టర్ లో మహేష్ బాబుని చూసిన ప్రతి ఒక్క ఫ్యాన్ కి పూనకాలు రావడం పక్కా అంటూ సినిమా యూనిట్ చాలా గట్టిగా చెప్తుంది. ఇక దీన్ని బట్టి చూస్తుంటే త్రివిక్రమ్ భారీ ఎత్తున క్లైమాక్స్ లో ఏదో ప్లాన్ చేసినట్టుగా అర్థమవుతుంది. ఇంతకుముందు అలా వైకుంఠపురం లో సినిమాలో ఒక సాంగ్ తో ఫైట్ ని జత చేసి చాలా ఫ్రెష్ ఫీల్ ఇచ్చే విధంగా దాన్ని తిరకేకించాడు. ఆ సినిమా అప్పుడు ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో పాటుగా భారీ కలెక్షన్స్ ను సాధించింది. ఇప్పుడు కూడా గుంటూరు కారం సినిమాలో ఇలాంటి మ్యాజిక్ ని వర్కౌట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

మరి గురూజీ అనుకున్నట్టుగా తన స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా లేదా తెలియాలంటే గుంటూరు కారం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాలి. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా మీదనే మహేష్ భార్య అంచనాల పెట్టుకున్నాడు. మరి మహేష్ అనుకున్న హిట్ దక్కుతుందా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading