సీనియర్ ఎన్టీఆర్ గురించి తెలియని వారుండరు. ఆయన చేసిన పౌరాణిక చిత్రాలు ఇప్పటికీ మన కళ్ల ముందు తారసపడుతూనే ఉన్నాయి. రాముడిగా, కృష్ణుడిగా, యమధర్మరాజుగా, అర్జునుడిగా రకరకాల పాత్రల్లో నటించారు. ఇలా ఎన్టీఆర్ నటించిన ప్రతి పాత్ర కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ ఏ పాత్రలో నటించినా ఆ పాత్ర సూపర్ హిట్ అయ్యేది అప్పట్లో. అందుకే పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరుగా ఎన్టీఆర్ అని చెప్పుకునే వారు. అయితే ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలు పోషించినప్పుడు ఆ సినిమాలోని ఆభరణాలను చాలా జాగ్రత్తగా దాచుకున్నారట.
Also Read : ఆన్ లైన్ లో చింతగింజల ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!
Advertisement
గతంలో ఓ ఇంటర్వ్యూలో సీనియర్ ఎన్టీఆర్ చెప్పారట. “1955లో జై సింహా సినిమాలోని ఓ సన్నివేశంలో.. నేను అర్జునుడి పాత్రలో నటించాను. నా పౌరాణిక చిత్రాలకు అదే ఫస్ట్ సినిమా. ఆ పాత్ర పోషించిన తరువాతనే నాకు పూర్తి స్థాయి పౌరాణిక చిత్రం చేయాలనే కోరిక కలిగింది. పౌరాణిక పాత్రలు ధరించి గుర్తింపు తెచ్చుకున్న తరువాత వాటిపై స్పెషల్ గా ఏదైనా చేయాలను ఆలోచన కూడా కలిగింది. అందుకే నా పరిశోధనకు జై సింహా సినిమా నాంది పలికింది” అంటూ తెలిపారు. ఆ రోజు నుంచి ఎన్టీఆర్ సినిమాల్లో నటించడం ఆపేసేంత వరకు కూడా ఎంతో మంది కళాదర్శకులు అద్భుతంగా రూపొందించినటువంటి ఆభరణాలను, కిరీటాలను భద్రపరుస్తూ వచ్చానని గుర్తు చేసుకున్నారు ఎన్టీఆర్.
Advertisement
Also Read : కూతురిని హెలికాప్టర్ లో అత్తారింటికి సాగనంపిన తండ్రి..వీడియో వైరల్ !
అంతేకాదు.. అందులో కొన్నింటిని తానే దగ్గర ఉండి మరీ తయారు చేయించుకున్నాను అని చెప్పుకొచ్చారు. వాటిని జాగ్రత్త చేసి ముందు తరాలకు అందించకపోతే నా అభిరుచి వారికి ఎలా తెలుస్తుంది అని అనే వారు. అందుకే ఆభరణాలను దాచినట్టు వెల్లడించారు ఎన్టీఆర్. తెలుగు సినిమా వజ్రోత్సవంలో కూడా వీటిని ప్రదర్శించారు. అదేవిధంగా కంటికి రెప్పలా వాటిని కాపాడుకుంటూ వచ్చానని.. వాటిని చూస్తున్నప్పుడు ఒక్కో కిరీటం.. ఒక్కో ఆభరణం తనలోని కళాకారులను తట్టి లేపుతుందని.. తనను తన్మయానికి గురిచేస్తుందన్నారు. తన ఖరీదు వెల కట్టలేదని.. ఈ అపురూప ఆభరణాలను చూస్తుంటే ఆనాటి పౌరాణిక వైభవం ఒక్కసారిగా కళ్ళలో అలా కదలాడుతుందని ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు ఎన్టీఆర్.
Also Read : బలగం మూవీ గురించి మెగాస్టార్ ఏమన్నారంటే?