Home » బలగం మూవీ గురించి మెగాస్టార్ ఏమన్నారంటే?

బలగం మూవీ గురించి మెగాస్టార్ ఏమన్నారంటే?

by Anji
Ad

చిన్న మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం సాధించిన బలగం మూవీపై  ప్రస్తుతం ప్రతీ ఒక్కరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. జబర్దస్త్ ఫేమ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మార్చి 03న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అంచనాలను మించి విజయం సాధించింది. దీంతో ఈ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి బలగం చిత్రం గురించి కొనియాడారు. స్వయంగా ఈ సినిమా టీమ్ ని కలిసిన చిరంజీవి దర్శకుడు వేణును అభినందించారు.

Also Read : Sr:NTRకు ‘బ్రదర్’ అనే మాట నేర్పింది ఎవరో తెలుసా..?

Advertisement

Advertisement

ఈ సందర్భంగా వేణును శాలువతో సత్కరించారు. ఇది నిజమైన చిత్రం అని.. ఇది నిజాయితితో తీశావని పేర్కొన్నారు. తెలంగాణ యొక్క సంస్కృతి చిత్రంలో ఉట్టిపడుతుందన్నారు. రియాలిటీకి ఈ సినిమా చాలా దగ్గర ఉందంటూ ప్రశంసించారు. అనంతరం చిరంజీవికి బలగం టీమ్ ట్వీట్ చేసింది. మెగా ప్రశంస అంటూ.. చిరంజీవి బలగం టీమ్ ని కలిసిన వీడియోను షేర్ చేశారు మేకర్స్. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో ప్రియదర్శి-కావ్య కళ్యాణ్ జంటగా నటించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూర్చారు.  

Also Read  : అఖిల ప్రియకు షాక్… వైసీపీలోకి భూమా మౌనిక? 

ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి పలు విమర్శలను అందుకుంటూనే సూపర్ హిట్ అందుకుంది. బలగం స్టోరీ కాపీ కొట్టారని ఓ జర్నలిస్ట్ ఆరోపించిన విషయం విధితమే. ఏది ఏమైనప్పటికీ దర్శకుడు వేణు తెరకెక్కించిన బలగం ఫస్ట్ సినిమాతోనే మంచి మార్కులను సాధించాడు. పాజిటివ్ టాక్ తో ఈ సినిమా మంచి కలెక్షన్లను వసూలు చేస్తుంది.

Also Read :  నోరు అదుపులో పెట్టుకో..లేదంటే…? తమ్మారెడ్డిపై నాగబాబు మరో వార్నింగ్ !

Visitors Are Also Reading