Home » యువరాణి పాత్రలో నటించి మెప్పించిన హీరోయిన్లు…!

యువరాణి పాత్రలో నటించి మెప్పించిన హీరోయిన్లు…!

by Bunty
Ad

హీరోయిన్స్ అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది గ్లామరస్ పాత్రలు. నటనకు ఏమాత్రం సంబంధం లేని క్యారెక్టర్స్ మనకు గుర్తుకు వస్తాయి. కానీ కొంతమంది హీరోయిన్స్ మాత్రం సినిమాలో పీరియాడిక్ సినిమాల్లో యువరాణుల పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. గ్లామర్ పాత్రలతో అలరిస్తున్న హీరోయిన్లు యువరాణుల పాత్రల్లో అద్భుతంగా నటిస్తూ ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకుంటున్నారు. అలా నటించిన హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

# సమంత

సమంత ఇప్పటివరకు అందం, అభినయం కలగలిపిన ఎన్నో పాత్రల్లో నటించి ఎంతోమంది ప్రేక్షకులను మెప్పించారు. అయితే తాజాగా గుణశేఖర్ దర్శకత్వం వహించినటువంటి శాకుంతలం సినిమాలో యువరాణి శాకుంతల పాత్రలో నటించి మెప్పించారు.

# తమన్నా

మిల్కీ బ్యూటీ తమన్నా ప్రతి సినిమాలో తన అందాలను వలకబోస్తూ ఎంతోమంది ప్రేక్షకులను ఫిదా చేస్తున్నారు. అయితే తమన్నా కూడా బాహుబలి సినిమాలో అవంతిక పాత్రలో నటించి మెప్పించారు.

# మృనాల్ ఠాగూర్

సీతారామం సినిమాతో ప్రేక్షకులకు దగ్గర అయినటువంటి మృణాల్ ఠాకూర్ నూర్జహాన్ పాత్రలో నటించి ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ ప్రిన్సెస్ నూర్జహాన్ పాత్రకు ప్రాణం పోసింది.

# కేథరిన్ థెరిసా

అందాల ముద్దుగుమ్మ కేథరిన్ థెరిసా బింబిసారా సినిమాలో యువరాణి పాత్రలో అద్భుతంగా నటించింది.

# శ్రియ శరణ్

అలనాటి ముద్దుగుమ్మ శ్రియ శరన్ గౌతమీపుత్ర శాతకర్ణి మూవీలో వశిష్ఠి దేవి పాత్రలో శ్రియా శరన్ యువరాణి పాత్రలో అత్యద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించారు.

Advertisement

# సావిత్రి

బహుముఖ ప్రజ్ఞకు పేరుగాంచిన అలనాటి నటి సావిత్రి మాయాబజార్ సినిమాలో యువరాణి పాత్రలో నటించింది. తన నటనకుగాను ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకుంది.

# శోభిత దూళిపాళ్ల

తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి శోభిత పోన్నియిన్ సెల్వన్ సినిమాలో యువరాణి పాత్రలో అద్భుతంగా నటించారు.

# నయనతార

లేడి ఓరియంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయినటువంటి నయనతార ఎన్నో సినిమాల్లో యువరాణి పాత్రలో నటించింది. అయితే తాజాగా కాష్మోరా సినిమాలో రత్న మహాదేవి పాత్రలో యువరాణిగా నటించి మెప్పించింది.

# త్రిష

అందాల ముద్దుగుమ్మ త్రిష పోన్నియిన్ సెల్వన్1, పోన్నియిన్ సెల్వన్ 2 రెండు సినిమాల్లో యువరాణి పాత్రలో చోళుల రాజకుమారి కుందవై పాత్రలో నటించి ఎంతోమంది ప్రేక్షకులను మెప్పించింది.

# ఐశ్వర్యరాయ్

ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ పోన్నియిన్ సెల్వన్1, పోన్నియిన్ సెల్వన్ 2 సినిమాల్లో యువరాణి పాత్రలో నటించి అలరించారు.

# రోజా

అలనాటి తార రోజా ఎన్నో పాత్రల్లో నటించి ప్రేక్షకులను సంపాదించుకుంది. అలానే భైరవద్వీపం సినిమాలో యువరాణి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

ఆ నటికి చెవిటి, మూగ..! కానీ ఒకే ఒక్క సినిమాతో

అప్సర కేసులో అదిరిపోయే ట్విస్ట్! ఇది అస్సలు ఊహించలే కదా ?

4 గురు పెళ్ళాలు ఉన్నా… ఒంటరోడే నా దేవుడు – శ్రీ రెడ్డి

Visitors Are Also Reading