Home » అప్సర కేసులో అదిరిపోయే ట్విస్ట్! ఇది అస్సలు ఊహించలే కదా ?

అప్సర కేసులో అదిరిపోయే ట్విస్ట్! ఇది అస్సలు ఊహించలే కదా ?

by Bunty
Ad

అప్సరా కేసులో గంటకో ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. తాజాగా అప్సర కేసులో ఆమెకు ముందే పెళ్లయినట్లు సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ గా మారాయి. హైదరాబాద్ లోని సరూర్నగర్ ఏరియాలో… రెండు రోజుల కింద అప్సర అనే యువతిని… సరూర్నగర్ కు చెందిన పూజారి సాయి కృష్ణ దారుణంగా చంపేసి… ఓ మ్యాన్ హోల్ లో పిడ్చేసాడు. ఆ తర్వాత ఏమి తెలియనట్టుగా పోలీసులకు అప్సర కనబడటం లేదని ఫిర్యాదు చేశాడు.

Advertisement

 

అయితే దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… పూజారి సాయిని గట్టిగా దర్యాప్తు చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది. తానే అప్సరను చంపేసినట్లు ఒప్పుకున్నాడు పూజారి సాయి. అప్సరకు తనకు… శారీరక సంబంధం ఉందని ఒప్పుకున్నాడు సాయి. అయితే తనకు ప్రెగ్నెన్సీ రావడంతో… పెళ్లి చేసుకోమని బలవంతం చేసింది అని చెప్పాడు. దీంతో అప్సర తాను చంపేసినట్లు వివరించాడు పూజారి. ఇదంతా పక్కకు పెడితే తాజాగా ఈ కేసులో ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది.

Advertisement

అప్సర కు ఇప్పటికే వివాహమైందని… ఆమె భర్త చనిపోయాడని… కొంతమంది ఆమె పెళ్లికి సంబంధించిన ఫోటోలను వైరల్ చేశారు. కర్ణాటకలో ఉన్న సమయంలోనే అప్సరకు వివాహం జరగగా.. ఆమె భర్త ఆ***త్య చేసుకున్నాడు. ఈ తరుణంలోనే హైదరాబాదులోని… సరూర్నగర్ కు షిఫ్ట్ అయింది. అక్కడే పూజారి సాయితో అప్సర పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త… అ**మ సంబంధానికి దారి చేసింది. ఈ తరుణంలోనే… వారి మధ్య గొడవ జరుగగా, అప్సర ను చంపేశాడు పూజారి. ప్రస్తుతం చర్ల పల్లి జైల్లో చిప్పకూడు తింటున్నాడు పూజారి సాయి. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని ముఖ్య వార్తలు !

ఆ నటికి చెవిటి, మూగ..! కానీ ఒకే ఒక్క సినిమాతో

జయలలిత కోసం శోభన్ బాబు ఎన్ని త్యాగాలు చేశారో తెలుసా..!

Visitors Are Also Reading