Home » ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరో విజయ్ తనయుడు.. కానీ హీరోగా కాదట..!!

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరో విజయ్ తనయుడు.. కానీ హీరోగా కాదట..!!

by Sravanthi
Ad

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో అయిన తళపతి విజయ్ తెలుగు ఇండస్ట్రీలో కూడా మంచి పేరు సంపాదించు కున్నారు. ఆయనకు ఈ రెండు ఇండస్ట్రీలలో ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అలాంటి తళపతి విజయ్ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం కలిగిన హీరో.. తాజాగా ఆయన నటించిన వారసుడు చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదంతా పక్కన పెడితే దళపతి విజయ్ కి ఒక కొడుకు ఉన్నాడు అనే విషయం అందరికీ తెలుసు. ఆయన పేరు జాన్సన్ సంజయ్. ఆ కుర్రాడు గతంలో స్టేజిపై తన డాన్స్ తో అందరిని ఆకట్టుకున్నాడు. త్వరలోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి..

Advertisement

also read:తాతయ్య చేతిలో నవ్వుతున్న ఈ చిన్నోడు పాన్ ఇండియా స్టార్..!!

Advertisement

ఈ తరుణంలో చాలామంది తలపతి విజయ్ ఫ్యాన్స్ ఆయన హీరోగా చేసే సినిమా ఏంటని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ జాన్సన్ హీరోగా కాకుండా, నటుడిగా కాకుండా, డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అవునండి మీరు విన్నది నిజమే విజయ్ కొడుకు సంజయ్ దర్శకుడిగా ఇండస్ట్రీలోకి వస్తారట. ఈ విషయాన్ని విజయ్ తండ్రి సంజయ్ తాత ఎస్ ఏ. చంద్రశేఖర్ మీడియా ద్వారా తెలియజేశారు.. ప్రస్తుతం సంజయ్ విదేశాల్లో దర్శకత్వానికి సంబంధించినటువంటి పలు టెక్నికల్ కోర్సులను నేర్చుకుంటున్నట్టు చెప్పాడు. సంజయ్ కి దర్శకత్వం పైన ఎక్కువగా ఆసక్తి, తను ఎప్పుడు కూడా డైరెక్టర్ అవుతానని చెబుతాడని ఆయన అన్నారు.

అందుకే ఆయన ఇంట్రెస్ట్ ప్రకారం దర్శకత్వానికి సంబంధించిన కోర్సులు నేర్చుకుంటున్నాడని తెలియజేశారు. తాను డైరెక్టర్ గా మారాక ముందుగా విజయ్ సేతుపతితో చిత్రాన్ని చేస్తారని, ఆ తర్వాత తన నాన్న దళపతి విజయ్ తో మూవీ చేస్తారని చంద్రశేఖర్ అన్నారు. ఈ విషయం బయటకు రావడంతో విజయ్ ఫ్యాన్స్ తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై మీ కామెంట్ ఏంటో చెప్పండి.

also read:

Visitors Are Also Reading